Share News

మాల్దీవులకు సాయంలో కోత

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:48 AM

గత బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.770.90 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి దానిని రూ.600 కోట్లకు తగ్గించేసింది. వాస్తవానికి నిరుటి పద్దులో ఆ దేశానికి తొలుత రూ.400 కోట్లు మాత్రమే ఇస్తామని పేర్కొన్నా.. తర్వాత దానిని బాగా

మాల్దీవులకు సాయంలో కోత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గత బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.770.90 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి దానిని రూ.600 కోట్లకు తగ్గించేసింది. వాస్తవానికి నిరుటి పద్దులో ఆ దేశానికి తొలుత రూ.400 కోట్లు మాత్రమే ఇస్తామని పేర్కొన్నా.. తర్వాత దానిని బాగా పెంచింది. 2022-23 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 300 శాతం అధికం కావడం గమనార్హం. అయితే, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కాగా, చైనాతో ఇబ్బంది ఎదుర్కొంటున్న భూటాన్‌కు రూ.2,068 కోట్లు ఇస్తూ పెద్దపీట వేసింది. నేపాల్‌కు రూ.700 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీటితర్వాత అత్యధికం కేటాయించింది మాల్దీవులకే. మరోవైపు మొత్తమ్మీద విదేశాలకు చేసే సాయాన్ని ప్రస్తుత బడ్జెట్‌లో 10 శాతం తగ్గించారు. నిరుడు రూ.5,426 కోట్లివ్వగా.. ఇప్పుడు దానిని రూ.4,883 కోట్లకు పరిమితం చేసింది.

Updated Date - Feb 02 , 2024 | 06:56 AM