చైనాలో స్పోర్ట్స్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు 35 మంది మృతి..43 మందికి గాయాలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:48 AM
దక్షిణ చైనాలోని జుహయ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ అదుపు కోల్పోవడంతో.. కారు అతి వేగంగా స్పోర్ట్స్‌సెంటర్‌లో వ్యాయామం చేస్తున్న వారిపైకి దూసుకువెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, 43

బ్యాంకాక్, నవంబరు 12: దక్షిణ చైనాలోని జుహయ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ అదుపు కోల్పోవడంతో.. కారు అతి వేగంగా స్పోర్ట్స్‌సెంటర్‌లో వ్యాయామం చేస్తున్న వారిపైకి దూసుకువెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, 43 మంది గాయపడ్డారు. కారు డ్రైవర్(62)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడా? లేక నిజంగానే ప్రమాదమా? అనేది దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జుహయ్‌లో ప్రతి ఏటా పీపుల్స్ లిజరేషన్ ఆర్మీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎయిర్‌షోకు ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, నిందితుడి పేరు ఫ్యాన్‌గా పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలైన కారణంగా అతను ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడని చికిత్స అందిస్తున్నామని తెలిపారు.