Ethiopia: ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:34 AM
ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లడంతో కనీసం 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోనా జిల్లాలో జరిగింది.

నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి ఇథియోపియాలో ఘోర ప్రమాదం
అడిస్ అబాబా, డిసెంబరు 30: ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లడంతో కనీసం 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోనా జిల్లాలో జరిగింది. ఆదివారం సాయంత్రం సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదపు తప్పి రోడ్డు మీద నుంచి నదిలో పడింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మరణించిన వారిలో కొందరు ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.