Share News

6 నుంచి హెచ్‌1బీ వీసా రిజిస్ట్రేషన్లు: యూఎస్‌సీఐఎస్‌

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:45 AM

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే హెచ్‌1బీ వీసా కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌

6 నుంచి హెచ్‌1బీ వీసా రిజిస్ట్రేషన్లు: యూఎస్‌సీఐఎస్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 29: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే హెచ్‌1బీ వీసా కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌1బీ ఎలకా్ట్రనిక్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమై అదే నెల 22 వరకూ కొనసాగుతుందని వెల్లడించింది. మరోవైపు, ఒక సంస్థలోని బహుళ వ్యక్తులు, వారి చట్టబద్ధమైన సంబంధీకుల హెచ్‌1బీ వీసా రిజిస్ట్రేషన్లు, దరఖాస్తుల ప్రక్రియలో సహకరించడానికి ఒక కొత్త వ్యవస్థను సిద్ధం చేసినట్లు యూఎస్‌ ఇమిగ్రేషన్‌ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దీనిలో భాగంగా సంస్థాగత ఖాతాలను ప్రారంభించినట్లు తెలిపింది. వీసా దరఖాస్తు ప్రక్రియలో సహకారాన్ని పెంపొందించడంతో పాటు ఇతర ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే దీని లక్ష్యమని పేర్కొంది. ప్రీమియం ప్రాసెసింగ్‌ సర్వీసులు ప్రారంభించడానికి ఐ-907, దాని అనుబంధ దరఖాస్తుల విషయంలో సహకరించడానికి ఈ ఖాతాలు అనుమతిస్తాయని వివరించింది.

Updated Date - Mar 01 , 2024 | 07:55 AM