Share News

USA: అమెరికన్ పౌరసత్వాన్ని పొందిన 59 వేల మంది భారతీయులు.. అత్యధికంగా ఏ దేశస్తులంటే

ABN , Publish Date - Feb 12 , 2024 | 08:01 AM

అమెరికన్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇటీవల విడుదల చేసిన 2023 వార్షిక పురోగతి నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2023లో భారత్‌కి చెందిన 59,100 మంది అమెరికన్ పౌరసత్వాన్ని పొందారు.

USA: అమెరికన్ పౌరసత్వాన్ని పొందిన 59 వేల మంది భారతీయులు.. అత్యధికంగా ఏ దేశస్తులంటే

వాషింగ్టన్: అమెరికన్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) ఇటీవల విడుదల చేసిన 2023 వార్షిక పురోగతి నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2023లో భారత్‌కి చెందిన 59,100 మంది అమెరికన్ పౌరసత్వాన్ని పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో (సెప్టెంబర్ 30, 2023 నాటికి) దాదాపు 8.7 లక్షల మంది విదేశీ పౌరులు US పౌరసత్వాన్ని పొందారు. వీరిలో 1.1 లక్షల మంది మెక్సికన్లు (12.7%), 59,100 భారతీయులు(6.7%) ఉన్నారు.

కొత్తగా నమోదు చేసుకున్న వారిలో 44,800 (5.1 శాతం) మంది ఫిలిప్పీన్స్ నుంచి, 35,200 (4 శాతం) డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఉన్నారు. పౌరసత్వం పొందేందుకు ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టంలో పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి. సాధారణంగా ఓ వ్యక్తి యూఎస్ సిటిజన్‌షిప్ పొందాలంటే కనీసం 5 సంవత్సరాలు అక్కడ నివసించాలి.

Updated Date - Feb 12 , 2024 | 08:03 AM