Share News

ఇజ్రాయెల్‌ దాడుల్లో 37 మంది పాలస్తీనీయుల మృతి

ABN , Publish Date - May 29 , 2024 | 03:35 AM

గాజా శరణార్థులు ఆశ్రయం పొందుతున్న రఫా గుడారాలపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలుమార్లు క్షిపణి, వైమానిక దాడులు జరిగాయి.

ఇజ్రాయెల్‌ దాడుల్లో 37 మంది పాలస్తీనీయుల మృతి

సెంట్రల్‌ గాజా, మే 28: గాజా శరణార్థులు ఆశ్రయం పొందుతున్న రఫా గుడారాలపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలుమార్లు క్షిపణి, వైమానిక దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌ జరిపిన ఈ దాడుల్లో 37 మంది పాలస్తీనా శరణార్థులు మృతిచెందినట్లు అసోసియేట్‌ ప్రెస్‌ పేర్కొంది. ఆదివారం గుడారాలకు నిప్పంటుకుని, 45 మంది మృతిచెందిన ప్రాంతానికి సమీపంలోనే తాజా దాడులు జరగడం గమనార్హం.

Updated Date - May 29 , 2024 | 07:42 AM