Share News

31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:31 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధమవుతుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి.

31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఫిబ్రవరి 9 వరకు నిర్వహణ

మహిళా రైతులపై వరాల జల్లుకు చాన్స్‌

న్యూఢిల్లీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధమవుతుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. 31న బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్‌లో మహిళా రైతులపై కేంద్రం వరాలు జల్లు కురిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద మహిళా రైతులకు ఇచ్చే నగదు సాయాన్ని ఈ బడ్జెట్‌లో రెట్టింపు చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - Jan 12 , 2024 | 06:47 AM