Share News

Blown plane door : 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం తలుపు

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:22 AM

అమెరికా గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. సిబ్బందితో కలిసి 177 మందితో 16వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ విమానం తలుపు హఠాత్తుగా ఊడిపోయింది.

Blown plane door : 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం తలుపు

న్యూఢిల్లీ, జనవరి 6: అమెరికా గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. సిబ్బందితో కలిసి 177 మందితో 16వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ విమానం తలుపు హఠాత్తుగా ఊడిపోయింది. అమెరికాలోని అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-9 విమానంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆరుగురు సిబ్బంది 171 మంది ప్రయాణికులతో పోర్ట్‌ల్యాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని తిరిగి పోర్ట్‌ల్యాండ్‌కు సురక్షితంగా చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తం అయ్యింది.

Updated Date - Jan 07 , 2024 | 04:22 AM