సముద్రంలో నౌక మునిగి 16 మంది గల్లంతు
ABN , Publish Date - Jul 17 , 2024 | 04:45 AM
ఒమన్ తీరానికి సమీపంలో ఒక ఆయిల్ ట్యాంకర్(నౌక) సోమవారం సముద్రంలో మునిగి 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు.
వారిలో 13 మంది భారతీయులు
మస్కట్, జూలై 16: ఒమన్ తీరానికి సమీపంలో ఒక ఆయిల్ ట్యాంకర్(నౌక) సోమవారం సముద్రంలో మునిగి 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక వాసులు. ఈమేరకు ఒమన్ తీరరక్షక దళం మంగళవారం వెల్లడించింది. సముద్రంలో ఆ నౌక తిరగబడి కనిపిస్తోందని తెలిపింది. అయితే దానిలోంచి ఆయిల్ లీకవుతోందా... లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎడెన్ ఓడరేవుకు వెళుతోన్న ఈ నౌక ఒమన్‌కు చెందిన పారిశ్రామిక ఓడరేవు దక్మ్‌కు సమీపంలో సముద్రంలో మునిగింది.