Share News

iPhone 15 Pro Max: ఐఫోన్ కొనివ్వలేదని కూతురు ఏం చేసిందో తెలుసా.. పాపం ఆ తండ్రి!

ABN , Publish Date - Jan 27 , 2024 | 08:07 PM

తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమ ఇష్టాలను చంపుకొని మరీ, పిల్లల కోరికల్ని తీరుస్తారు. తాము పస్తులుండి, పిల్లల కడుపు నింపుతారు. కానీ.. పిల్లలే పేరెంట్స్ ప్రేమని సరిగ్గా అర్థం చేసుకోరు.

iPhone 15 Pro Max: ఐఫోన్ కొనివ్వలేదని కూతురు ఏం చేసిందో తెలుసా.. పాపం ఆ తండ్రి!

తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమ ఇష్టాలను చంపుకొని మరీ, పిల్లల కోరికల్ని తీరుస్తారు. తాము పస్తులుండి, పిల్లల కడుపు నింపుతారు. కానీ.. పిల్లలే పేరెంట్స్ ప్రేమని సరిగ్గా అర్థం చేసుకోరు. తాము కోరిన ఏదైనా ఒక కోరికని నెరవేర్చకపోతే చాలు.. కనిపెంచిన తల్లిదండ్రులనే శత్రువులుగా చూడటం మొదలుపెడతారు. అందరూ పిల్లలు కాదు కానీ, కేవలం కొద్దిమంది మాత్రమే ద్వేషం పెంచుకుంటారు. తాజాగా ఓ 11 ఏళ్ల అమ్మాయి కూడా.. తనకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనివ్వలేదన్న పాపానికి తండ్రిపై ద్వేషం పెంచుకుంది. తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తండ్రికే చెప్పింది. దీంతో నొచ్చుకున్న ఆ తండ్రి.. తన బాధని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.


‘‘నాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. తనకు ఐఫోన్ అంటే ఇష్టమని తెలియడంతో.. గతంలో నేను వాడిన ఐఫోన్ 8 మొబైల్‌ని రెండేళ్ల క్రితం నా కుమార్తెకు ఇచ్చాను. తన స్నేహితులతో చాటింగ్ చేయడానికి, సోషల్ మీడియాలో కాలం గడపడానికి మాత్రమే తాను ఆ ఫోన్‌ని వాడుతుంది. అయితే.. తన స్నేహితులందరూ కొత్త ఫోన్లు కొనుగోలు చేయడంతో, నా కూతురు కూడా కొత్త ఫోన్ కావాలని అడుగుతోంది. నేను ఐఫోన్ 13 కొనివ్వాలని అనుకున్నాను. ఎందుకంటే.. అది 600 డాలర్లు. పైగా.. ఆ ఫోన్ మంచి కెమెరా, బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉంటుంది. పైగా.. కొత్త ఐఫోన్ వర్షన్‌లాగే కనిపిస్తుంది. కానీ.. నా కూతురు మాత్రం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కావాలని పట్టుబడుతోంది. ఎందుకంటే.. అందులో కన్సోల్ స్థాయి గేమ్‌లను ఆడేందుకు వీలుంటుంది, అలాగే 120hz డిస్‌ప్లేను కలిగి ఉంది. నా కూతురు ఓ గేమర్ కాబట్టి.. పాత మొబైల్‌ గేమ్ ఆడేందుకు సహకరించడం లేదని ఈ కొత్త ఫోన్ కావాలని కోరుతోంది’’.

‘‘నాకున్న బడ్జెట్ పరిధిలో ఐఫోన్ 13 కొనిస్తానని చెప్పినా.. నా కూతురు మాత్రం దానికి రెట్టింపు ధర అయిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (1,000 డాలర్స్) కావాలని అడుగుతోంది. ఆ ఫోన్‌కి అంత డబ్బు కేటాయించడం వృధా అనుకొని నేను కొనివ్వనని తిరస్కరించాను. దీంతో ఆమె తీవ్ర కోపాద్రిక్తురాలైంది. ఆ కోపంలో ‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావ్’ అని నా మీద నింద వేసింది. ఆ మాట విని నేను తట్టుకోలేకపోయాను. నా భార్య కూడా నొచ్చుకొని.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనిద్దామని, ఒక బహుమతిగా ఇవ్వాలని సూచించింది’’ అంటూ ఆ తండ్రి తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. తండ్రికే మద్దతుగా నిలిచారు. 11 ఏళ్ల అమ్మాయికి వెయ్యి డాలర్ల ఫోన్ అవసరం లేదని, ఐఫోన్ 13 కొనిస్తే చాలంటూ సూచనలు ఇస్తున్నారు.

Updated Date - Jan 27 , 2024 | 08:07 PM