Share News

Canada: విదేశీ ముప్పు నినాదంతో ఎన్నికల్లోకి ట్రూడో.. భారత్‌పై తీవ్ర ఆరోపణలు

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:09 PM

భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ దేశంలో ఎన్నికలు జరగనుండగా... భారత్‌తో కెనడాకు "విదేశీ ముప్పు"(Foreign Threat) ఏర్పడుతోందనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.

Canada: విదేశీ ముప్పు నినాదంతో ఎన్నికల్లోకి ట్రూడో.. భారత్‌పై తీవ్ర ఆరోపణలు

కెనడా: భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ దేశంలో ఎన్నికలు జరగనుండగా... భారత్‌తో కెనడాకు "విదేశీ ముప్పు"(Foreign Threat) ఏర్పడుతోందనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. కెనడా గడ్డపై 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యకు గురైన విషయం విదితమే.

ఈ హత్యను భారత ప్రభుత్వమే చేయించినట్లుగా ఆ దేశ ప్రధాని పార్లమెంటులో ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాయి. అప్పటి నుంచి సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. అయితే విదేశీ ముప్పు అంటూ చేసిన కెనడా ఆరోపణలపై భారత్ ఇంకా స్పందించలేదు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2024 | 12:10 PM