బట్టతలపై జుట్టు మొలిచిన విధంబెట్టిదనిన..
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:28 AM
‘రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా..’ అని సామెత! దాన్నిప్పుడు. ‘బిలియనీర్ తల్చుకుంటే బట్టతలపై జుట్టు మొలిపించడం కష్టమా?’’ అని మార్చుకోవచ్చు. అవును.. వయసు మీరే ప్రక్రియను రివర్స్ చేసేందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న అమెరికన్ బిలియనీర్

న్యూయార్క్, అక్టోబరు 24: ‘రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా..’ అని సామెత! దాన్నిప్పుడు. ‘బిలియనీర్ తల్చుకుంటే బట్టతలపై జుట్టు మొలిపించడం కష్టమా?’’ అని మార్చుకోవచ్చు. అవును.. వయసు మీరే ప్రక్రియను రివర్స్ చేసేందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న అమెరికన్ బిలియనీర్ బ్రయాన్స్ జాన్సన్ (47).. తన బట్టతలపై జుట్టు మొలిపించి చూపించారు. ‘‘జన్యుపరంగా అయితే.. ఇప్పటికే నాకు పూర్తిస్థాయిలో బట్టతల వచ్చేసి ఉండాలి. ముప్పై ఏళ్లకు దగ్గర్లో ఉన్నప్పుడు నా జుట్టు ఊడడం మొదలైంది. కానీ, ఇప్పుడు నా వయసు 47 సంవత్సరాలు. నా తలపై పూర్తిగా జుట్టుంది. 70ు తెల్లజుట్టు నల్లబడింది.’’ అని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. నిజానికి.. బట్టతల సమస్యకు పరిష్కారంగా మార్కెట్లో ఇప్పటికే ‘మినాక్సిడిల్’ అనే మందు అందుబాటులో ఉంది. దాన్ని వాడడంతోపాటు తాను తీసుకున్న ఇతరత్రా జాగ్రత్తలు, చికిత్సలు, పోషకాల గురించి కూడా ‘ఎక్స్’లో పలు పోస్టుల ద్వారా జాన్సన్ వివరించారు. మినాక్సిడిల్ ఔషఽధాన్ని వాడడం కన్నా ముందు.. విటమిన్లు, పోషకాలు.. ముఖ్యంగా ప్రొటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలను తాను ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నానని తెలిపారు. రోజూ ఒక ప్రత్యేకమైన టోపీని ధరించడం ద్వారా.. తన తల వెం ట్రుకలకు ‘ఎర్రటి కాంతి చికిత్స’ చేసేవాణ్నని వివరించారు. కొద్దిగా ఆలస్యమైతే కావచ్చుగానీ.. జుట్టు రాలడం అనేది భవిష్యత్తులో అంత పెద్ద సమస్య కాదని భరోసా ఇచ్చారు.