Share News

Health: వెజిటేరియన్ గా మారాలనుకుంటున్నారా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..

ABN , Publish Date - Jan 06 , 2024 | 10:22 AM

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాలన్నీ సమానంగా అందినప్పుడే మన శరీరం సమర్థంగా పని చేస్తుంది.

Health: వెజిటేరియన్ గా మారాలనుకుంటున్నారా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాలన్నీ సమానంగా అందినప్పుడే మన శరీరం సమర్థంగా పని చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూరగాయలు, పండ్లు, మాంసం, పాలు వంటి వాటిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. కొంతమంది పూర్తిగా శాకాహారాన్ని భుజిస్తే.. మరికొందరు మాత్రం నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదంటారు. ఇక వెజ్, నాన్ వెజ్ రెండింటినీ తినే వారూ ఉన్నారు. అయితే.. మాంసాహారాన్ని అదే పనిగా తినడం వల్ల శరీరానికి అనవసరమైన ఇబ్బందులూ వస్తాయి. ఊబకాయం, కొవ్వు కరిగిపోవడం వంటి సమస్యలకు గురవుతాయి. దీంతో చాలా మంది వెజ్ వైపు మారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే.. ఇది అనుకున్నంత సులువు కాదు.. మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

ముందుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. వెజ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేసుకోండి. ఎందుకు తినాలనుకుంటున్నారు.. నాన్ వెజ్ ను ఎందుకు మానేస్తున్నారు అనే విషయాలను నోట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ కు సంబంధించిన పుస్తకాలు చదవడం, డాక్యుమెంటరీలు చూడడం ద్వారా శాకాహారం గురించి అవగాహన పెంపొందించుకోవచ్చు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు తొందరపడటం కరెక్ట్ కాదు. నాన్ వెజ్ ను పూర్తిగా మానేసి, నేరుగా వెజ్ ను తీసుకోవడం కరెక్ట్ కాదు. మన శరీరం నాన్ వెజ్ కు అలవాటుపడి సడెన్ గా వెజ్ ఫుడ్ తీసుకుంటే సరిగ్గా పని చేయకపోవచ్చు. కాబట్టి నెమ్మదిగా కొద్ది కొద్దిగా తినడం మేలు.


నాన్ వెజ్ స్థానంలో శాకాహార వంటలను ప్రయత్నించండి. వంటలతో ప్రయోగాలు చేయండి. మాంసం స్థానంలో పప్పులు, పాల ఉత్పత్తులకు బదులు సోయమిల్క్ వంటివి ఉత్తమం. ఇలాంటి ఆహారం వైద్యపరంగానూ ప్రయోజనం కలిగి ఉంటుంది. రోజువారి ఫుడ్ లో పండ్లు, కూరగాయలు, నట్స్, మిల్లెట్స్ ను భాగం చేసుకోవాలి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వీలైతే వేగన్ సంఘంలో చేరడం ఉత్తమం. అంతే కాకుండా మీలాగే అదే ఆహార లక్ష్యాలను కలిగి ఉన్న వారితో సంభాషిస్తుండటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 06 , 2024 | 10:22 AM