Share News

Bajra : సజ్జలతో అదిరిపోయే బెనిఫిట్స్ .. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు..!

ABN , Publish Date - Jan 20 , 2024 | 12:06 PM

ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉన్న సజ్జలు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి.

Bajra : సజ్జలతో అదిరిపోయే బెనిఫిట్స్ .. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు..!
bajra

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఇందులో ముందు వరుసలో తృణధాన్యాలుంటాయి. ఇవి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి కూడా.. అయితే తృణధాన్యాల్లో ముఖ్యంగా బాజ్రా లేదా సజ్జలను గురించి చెప్పుకుంటే.. ఇందులో అనేక సూక్ష్మపోషకాలున్నాయి. దీనితో పాటు విటమిన్లు, అమైనో ఆమ్లాలతో కూడిన ఆహార ధాన్యం. పిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలతో సహా అందరికీ ఇది మంచి ఆహారం. సజ్జలతో పాటుగా జొన్న (జోవర్), ఫింగర్ మిల్లెట్స్ (రాగి,నాచ్ని), ప్రోసో మిల్లెట్స్, ఫాక్స్‌టైల్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్ (సమై) ఇతర రకాల మిల్లెట్‌లు సాధారణ భోజనంలో పోషక విలువలను పెంపొందించడానికి వాడుతూ ఉన్నాం. అసలు సజ్జలు ఆరోగ్యానికి ఎలా ప్రయోజనాన్ని అందిస్తాయి అనేది చూద్దాం.

పెర్ల్ మిల్లెట్ అంటే ఏమిటి?

పెర్ల్ మిల్లెట్, సాధారణంగా బాజ్రా అని, సజ్జలు అని పిలుస్తారు, ఇది చాలా పోషకమైన ఆహారం. సజ్జలు సులభంగా జీర్ణమయ్యే తృణధాన్యం. గ్లూటినస్‌లేని కారణంగా గ్లూటెన్ అలెర్జీ కడుపు సమస్యలు ఉన్నవారికి ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా పనిచేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, థయామిన్, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరోటిన్ వంటి చాలా రకాల విటమిన్లు, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాల శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఏ వయసు వారు తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది.

శీతాకాలంలో పెర్ల్ మిల్లెట్ ఆరోగ్య ప్రయోజనాలు..

ఇన్పెక్షన్లను అరికట్టడానికి శీతాకాలం ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవాలి. పెర్ల్ మిల్లెట్ అటువంటి ఆహారాలలో ఒకటి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. పెర్ల్ మిల్లెట్‌లో కరిగే డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మల బద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుతుంది.


తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది..

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు శరీరాన్ని విచ్ఛిన్నం చేయడం కష్టం. ఇది టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి సహకరిస్తుంది.

బరువు తగ్గించేందుకు..

ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఇది బరువు తగ్గించడంలో సహకరిస్తుంది. అలాగే ఇందులోని అధిక పోషకాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు మంచి ఆహారం.

గుండె ఆరోగ్యానికి మంచిది..

సజ్జలు లేదా పెర్ల్ మిల్లెట్‌లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి. గుండె సమస్యలకు కారణమయ్యే కొలెస్ట్రాల్ ప్రమాదకర కారకాలను కూడా తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఇలా ఉంటే దాంపత్య జీవితం ఆనందమయం..!


దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు సహకరిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రోగనిరోధక పనితీరుకు..

ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉన్న సజ్జలు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి.

రక్తపోటును తగ్గిస్తుంది.

సజ్జల్లో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. పోటాషియం తీసుకోవడం వల్ల సోడియంను క్లియర్ చేయడంలో సహకరించి రక్తపోటును తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 20 , 2024 | 03:48 PM