Share News

Tour: టూర్‌కు వెళుతున్నారా? అయితే ఈ ఐదింటినీ తప్పక వెంట తీసుకెళ్లండి!

ABN , Publish Date - Feb 01 , 2024 | 07:14 PM

పర్యటనల సమయంలో వెంట కచ్చితంగా తీసుకెళ్లాల్సిన స్నాక్స్ ఐదు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

Tour: టూర్‌కు వెళుతున్నారా? అయితే ఈ ఐదింటినీ తప్పక వెంట తీసుకెళ్లండి!

ఇంటర్నెట్ డెస్క్: సెలవుల్లో సరదాగా టూర్‌లకు వెళితే మానసికోల్లాసం కలుగుతుంది. రోటిన్ నుంచి కాస్తంత బ్రేక్ తీసుకుని రిఫ్రెష్ అయ్యేందుకు పర్యటనలు ఎంతో అవసరం. అయితే, టూర్‌లపై వెళ్లేవాళ్లు ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రాంతాలకు వెళతాం కాబట్టి వెంట స్నాక్స్ తీసుకుని వెళ్లడం ఉత్తమం. ఇలాంటి సందర్భాలకు అత్యంత అనువుగా ఉండే 5 స్నాక్స్‌ను న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు (Essential Snacks while travelling). వీటిని తప్పక ప్యాక్ చేసుకుని తీసుకెళ్లాలని చెబుతున్నారు. అవేంటంటే..

అరటి పళ్లు

కవర్‌లో పెట్టుకుని వెంట తీసుకెళ్లగలిగే అరటిపళ్లు పర్యాటకులకు అత్యంత అనువైన స్నాక్స్. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినగానే అలసట దూరమై కొత్త శక్తి వస్తుంది.

యాపిల్, నారింజ

అద్భుతమైన రుచితో ఉండే యాపిల్ పళ్లు, నారింజలు కూడా టూర్‌లకు అనువైన స్నాక్స్. వీటిల్లో విటమిన్ సీ తోపాటూ పలు ఇతర పోషకాలు ఉంటాయి. వెంట తీసుకెళ్లడం కూడా సులువే.

ద్రాక్ష

చటుక్కున నోట్లో వేసుకుని తినేలా ఉండే ద్రాక్షపళ్ల రుచి అమోఘం. ఇది కూడా కంటెయినర్లలో పెట్టుకుని సులువుగా వెంట తీసుకెళ్లొచ్చు. తక్షణ శక్తినిచ్చే ద్రాక్ష ప్రయాణాల్లో తప్పక వెంటుండాల్సిన స్నాక్స్.

పుచ్చకాయ, పైనాపిల్

పుచ్చకాయ, పైనాపిల్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ముక్కలుగా తరిగి కంటెయినర్‌లలో పెట్టుకుని వెంట తీసుకెళొచ్చు. టూర్‌లలో అవసరమైన సందర్భాల్లో ఇది తిని రిఫ్రెష్ అవ్వొచ్చు.

వెజ్జీ స్టిక్స్

కారెట్, లేదా కీర దోస ముక్కలు కూడా టూర్‌లకు అనువైన చిరుతిళ్లు. యోగర్ట్‌లో వీటిని అద్దుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అలసట కూడా వెంటనే తీరిపోతుంది. కాబట్టి, టూర్లకు వెళ్లేవారు వీటిల్లో ఏదో ఒకదాన్ని కచ్చితంగా వెంట తీసుకెళ్లాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 07:21 PM