Share News

మామ కోసం కోడలు

ABN , Publish Date - May 02 , 2024 | 05:48 AM

ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న రామసహాయం రఘురాంరెడ్డి విజయం కోసం ఆయన పెద్ద కోడలు, హీరో వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత బుధవారం ప్రచారం చేశారు. ఖమ్మంలోని పోలీసు

మామ కోసం కోడలు

ఖమ్మంలో హీరో వెంకటేశ్‌ కుమార్తె

ఆశ్రిత ఎన్నికల ప్రచారం

బరిలో ఆమె మామ రామసహాయం రఘురాంరెడ్డి

ఖమ్మం సంక్షేమవిభాగం, మే 1: ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న రామసహాయం రఘురాంరెడ్డి విజయం కోసం ఆయన పెద్ద కోడలు, హీరో వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత బుధవారం ప్రచారం చేశారు. ఖమ్మంలోని పోలీసు హౌసింగ్‌ కాలనీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆశ్రిత పాల్గొని తన మామగారైన రఘురాంరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు బేబి స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా... ఈ నెల 7న వియ్యంకుడి కోసం హీరో వెంకటేశ్‌ సైతం ఖమ్మంలో ప్రచారం చేయనున్నారు.

Updated Date - May 02 , 2024 | 05:48 AM