Share News

‘బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌ – 2024’

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:29 AM

భారతీయ భాషల సాహిత్య ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దక్షిణ భారతీయ భాషల ప్రచురణ కర్తలను అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ‘బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌ – 2024’

‘బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌ – 2024’

భారతీయ భాషల సాహిత్య ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దక్షిణ భారతీయ భాషల ప్రచురణ కర్తలను అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ‘బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌ – 2024’ జరుగుతున్నది. ఆగస్ట్‌ 9 నుంచి 11 వ తేదీ వరకు సెయింట్‌ జాన్స్‌ ఆడిటోరియం, కోరమంగల, బెంగళూరులో జరిగే ఈ వేడుకలో డెలిగేట్స్‌గా పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమం నేటితో మొదలవుతున్నది. పాల్గొనే ఉత్సాహం ఉన్నవారు www.bookbrahmalitfest. com అనే వెబ్‌సైట్‌కు వెళ్లి మీ పేర్లను ఉచితంగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో ఉచితంగా రిజిస్టర్‌ చేసుకున్న డెలిగేట్స్‌కు ఎంట్రీ పాస్‌ లభిస్తుంది, వారికి మాత్రమే ఫెస్టివల్‌ గ్రౌండ్స్‌లో ప్రవేశం ఉంటుంది. ఈ మూడు రోజుల వేడుకలో ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి 450 మంది రచయితలు, 100 మంది పబ్లిషర్లు పాల్గొంటారు. కన్నడ, తమిళ్‌, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్‌ భాషల పుస్తకాలతో 60 బుక్‌స్టాల్స్‌ ఉంటాయి. ఈ మూడు రోజుల్లోనూ ఐదు ఆడిటోరియమ్స్‌లో ఏకకాలంలో వేర్వేరు సెషన్లు మొత్తం 80 దాకా జరుగుతాయి. వేడుకలో హెచ్‌.ఎస్‌. శివప్రకాష్‌, వివేక్‌ షాన్‌భాగ్‌, జెయమోహన్‌, పెరుమాల్‌ మురుగన్‌, బెన్యమిన్‌, కె. సచ్చిదానందన్‌, గిరిష్‌ కాసరవల్లి, ఓల్గా, సి. మృణాళిని... తదితర ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొంటారు. పండిట్‌ వెంకటేష్‌ కుమార్‌, ఆర్‌.కె. పద్మనాభ వంటి సంగీతకారుల సంగీత ప్రదర్శనలు, నటుడు ప్రకాష్‌ రాజ్‌ తదితరులచే పుస్తక పఠనాలు, మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

వివరాలకు ఫోన్‌: 70194 81044

– స్వాతిరావ్‌

Updated Date - Jun 11 , 2024 | 05:29 AM