Share News

Horoscope Today: ఈ రాశుల వారికి ముఖ్య గమనిక.. వెంటనే చెక్ చేసుకోండి!

ABN , Publish Date - May 07 , 2024 | 07:41 AM

నేడు (7-5-2024 - మంగళవారం) ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది...

Horoscope Today: ఈ రాశుల వారికి ముఖ్య గమనిక.. వెంటనే చెక్ చేసుకోండి!

నేడు (7-5-2024 - మంగళవారం) ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు విషయంలో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. విలాలసాకు ఖర్చు చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయండి.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వ్యక్తిగత సౌకర్యాలను పెంపొందించుకుంటారు. మీ ప్రయత్నాలకు కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించడతో మనోవేదనకు గురవుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభ ప్రదం.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలు, విదేశీ వ్యవహరాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సినీ, రాజకీయ రంగాల వారు కొంత నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా పూర్తవుతాయి. యోగధ్యానాలకు అనుకూల సమయం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యతను గమనించాలి. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, వడ్డీ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. హనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. ప్రభుత్వ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌరవమర్యాదలకు భంగం కలగవచ్చు. శ్రీ సుబ్ర హ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, ఈ వెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సమావేశాల్లో నిదానం అవసరం. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సకాలంలో డబ్బు చేతికి అందక కొంత ఇబ్బంది పడతారు. పన్నులు, బ్యాంక్‌లోన్‌ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పెన్షన్‌, మెడికల్‌ క్లెయిములు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో నష్టం వాటిల్లే అ వకాశం ఉంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదుర్కొంటారు. న్యాయ వివాదాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అ వకాశం ఉంది. పందాలు పోటీలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. సహోద్యోగుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. ఫార్మా, హాస్టళ్లు, ఆహార రంగ వ్యాపారులకు కొంత నిరాశ ఎదరయ్యే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ కోసం ఖర్చులు అధికం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం. హనామాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. భూములు, ఇళ్ల క్రయవిక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. హార్డ్‌వేర్‌, నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్‌ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. అద్దె వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అన్నదానం శుభప్రదం.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

డ్రైవింగ్‌లో నిదానం పాటించండి. రాతకోతల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. చెక్కులు, పత్రాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బంది పడతారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - May 07 , 2024 | 07:41 AM