Share News

Horoscope Today: ఈ రాశుల వారికి ఇవాళంతా శుభప్రదమే.. అన్ని అంశాల్లో అదృష్టమే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 07:07 AM

నేడు (22-3-2024 - శుక్రవారం) సంకల్పం నెరవేరుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు...

Horoscope Today: ఈ రాశుల వారికి ఇవాళంతా శుభప్రదమే.. అన్ని అంశాల్లో అదృష్టమే..

నేడు (22-3-2024 - శుక్రవారం) సంకల్పం నెరవేరుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సంకల్పం నెరవేరుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. క్రీడలు, టెలివిజన్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అ వసరమైన నిధులు సర్దుబాటవుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పెద్దలు, పైఅధికారుల సహకారం అ భిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు చేస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారం అ వుతాయి. ఉన్నత విద్య కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్పం నెరవేరతుంది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అ వుతాయి. పన్నులు, ఫీజులు చెల్లిస్త్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లలో లాభాలు అందుకుంటారు. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గౌరవ పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలమైన సమయం. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కన్సల్టెంట్‌ంట్‌లు, ఆడిటర్లు, న్యాయరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వారసత్వ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పన్నులు, ఇంటి రుణ విషయాలు పరిష్కారం అవుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణం, స్థలసేకరణకు కావలసిన నిధులు సర్దుబాటవుతాయి. సిమెంట్‌, ఐరన్‌ వ్యాపారులకు అనుకూలమైన రోజు

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు అనందం కలిగిస్తాయి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. తోబుట్టువుల సహకారం లభిస్తుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. ఆస్పత్రులు, హోటల్‌, క్యాటరింగ్‌, హాస్టల్‌ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. వైద్య సేవలకు కావలసిన నిధులు సర్దుబాటవుతాయి. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Mar 22 , 2024 | 07:19 AM