Share News

Maharashtra: తండ్రి కాదు.. నరరూప రాక్షసుడు.. పిల్లాడు ఆ పని చేసిన పాపానికి..

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:16 PM

పిల్లలు ఏదైనా తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పటికప్పుడే మందలిస్తారు. మళ్లీ అలాంటి తప్పులు చేయకూడదని, చిన్న చిన్న శిక్షలు కూడా విధిస్తారు. ఒకవేళ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ రిపీట్ చేసినా.. ఎంత మందలించినా మార్పు రాకపోయినా.. ఇంకాస్త కఠినంగా వ్యవహరిస్తారు. నాలుగు దెబ్బలు తగిలించడమో, రెండు మూడు రోజుల పాటు బెడ్‌రూంలోనే బంధించడమో చేస్తారు.

Maharashtra: తండ్రి కాదు.. నరరూప రాక్షసుడు.. పిల్లాడు ఆ పని చేసిన పాపానికి..

పిల్లలు ఏదైనా తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పటికప్పుడే మందలిస్తారు. మళ్లీ అలాంటి తప్పులు చేయకూడదని, చిన్న చిన్న శిక్షలు కూడా విధిస్తారు. ఒకవేళ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ రిపీట్ చేసినా.. ఎంత మందలించినా మార్పు రాకపోయినా.. ఇంకాస్త కఠినంగా వ్యవహరిస్తారు. నాలుగు దెబ్బలు తగిలించడమో, రెండు మూడు రోజుల పాటు బెడ్‌రూంలోనే బంధించడమో చేస్తారు. కానీ ఓ తండ్రి ఏం చేశాడో తెలుసా? కన్న కొడుకుని విషమిచ్చి చంపేశాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అసలెందుకు ఆ తండ్రి అంత దారుణానికి పాల్పడ్డాడు? కొడుకు చేసిన తప్పేంటి? పదండి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

విజయ్ బట్టు అనే వ్యక్తి షోలాపూర్ సిటీలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. టైలర్‌గా పని చేస్తున్న విజయ్.. తన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో మంచి స్కూళ్లలో చదివిస్తున్నాడు. కట్ చేస్తే.. విజయ్ పెద్ద కొడుకు విశాల్ (14) జనవరి 13వ తేదీన ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. అతని కోసం ఎక్కడ గాలించినా, సన్నిహితుల్ని అడిగినా.. ఆచూకీ దొరకలేదు. దీంతో.. విజయ్, అతని భార్య కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమ కొడుకు విశాల్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత ఆ దంపతుల ఇంటికి సమీపంలోని కాలువలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.


పోస్టుమార్టం నిమిత్తం విశాల్ బాడీని ఆసుపత్రికి తరలించగా.. రిపోర్ట్‌లో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విశాల్‌ బాడీలో సోడియం నైట్రేట్‌ అనే విషపదార్థం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో.. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విజయ్ కుటుంబీకులు, ఇరుగుపొరుగు వారిని విచారించారు. ఈ నేపథ్యంలోనే.. విజయ్ ఇచ్చిన సమాచారంలో తేడాలున్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త ప్రవర్తనలో మార్పులు గమనించిన భార్యకు కూడా అనుమానం వచ్చింది. దీంతో అతడ్ని నిలదీయగా.. తానే విశాల్‌ని హతమార్చినట్టు జనవరి 28న విజయ్ భార్య ముందు ఒప్పుకున్నాడు. విశాల్ ఇతర విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నాడని, చదువుపై దృష్టి పెట్టట్లేదని తనకు ఫిర్యాదులు అందాయని అతడు చెప్పాడు.

అంతేకాదు.. 14 ఏళ్ల వయసులోనే విశాల్ అడల్ట్ సినిమాలకు అడిక్ట్ అయిన విషయం తనకు తెలిసిందని, ఆ అలవాటు వదులుకోవాలని ఎన్నిసార్లు మందలించినా అతడు మారలేదని విజయ్ తన భార్యకూ తెలిపాడు. కుమారుడి ప్రవర్తనతో తాను అసంతృప్తిగా ఉండటం వల్లే.. ఇలా విషమిచ్చి చంపానని నేరాన్ని అంగీకరించాడు. జనవరి 13న ఉదయం బైక్‌పై విశాల్‌ని తీసుకెళ్లి.. సోడియం నైట్రేట్ కలిపిన సాఫ్ట్ డ్రింక్ ఇచ్చానన్నాడు. అతడు మృతిచెందాక.. ఇంటి సమీపంలో ఉన్న కాలువలో పడేశానన్నాడు. దీంతో భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా.. విజయ్‌ని అరెస్ట్ చేసి, జనవరి 29న మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడ్ని పోలీసు కస్టడీకి పంపింది.

Updated Date - Feb 01 , 2024 | 11:16 PM