Share News

Hyderabad: మా ఫ్యామిలీ చెట్టుపై ఉంది అంటూ.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:35 PM

‘మా ఫ్యామిలీ చెట్టుపై ఉంది..’ అంటూ ఓ యువకుడు భారీ చెట్టు ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సుమారు రెండు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది, పోలీసులు అందరూ కలిసి అతడిని అతికష్టం మీద కిందికి దించారు. అతడి మాటలను బట్టి మతిస్థిమితం లేనట్లుగా గుర్తించారు.

Hyderabad: మా ఫ్యామిలీ చెట్టుపై ఉంది అంటూ.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు.. విషయం ఏంటంటే..

బౌద్ధనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ‘మా ఫ్యామిలీ చెట్టుపై ఉంది..’ అంటూ ఓ యువకుడు భారీ చెట్టు ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సుమారు రెండు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది, పోలీసులు అందరూ కలిసి అతడిని అతికష్టం మీద కిందికి దించారు. అతడి మాటలను బట్టి మతిస్థిమితం లేనట్లుగా గుర్తించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చిలకలగూడ(Chilakalaguda) పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మట్టంరాజు, అడ్మిన్‌ ఎస్సై బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్‌టాకీస్‌ గల్లీ వద్ద ఓ యువకుడు అతిపెద్ద చెట్టు ఎక్కి, ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చిలకలగూడ పోలీసులకు సమాచారమందింది. ఇన్‌స్పెక్టర్‌ మట్టంరాజు, అడ్మిన్‌ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. చెట్టు దిగమంటూ అతడిని కోరారు. చెట్టుపై ఉన్న యువకుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. అతడిని మాటల్లో పెట్టి డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది క్రేన్‌ సహాయంతో కిందికి దించారు. వివరాలు అడిగితే తనపేరు రబీందర్‌, ఛత్తీస్‏గఢ్‌ అని చెప్పాడు. చెట్టు ఎందుకు ఎక్కావు అంటే తమ ఫ్యామిలీ చెట్టుపై ఉందంటూ ఇది నాగపూర్‌ కాదా.. అని పోలీసులను ప్రశ్నించాడు. పోలీసులు యువకుడిని చిక్సిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడిని చాకచక్యంగా కిందికి దించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:35 PM