Share News

Hyderabad: వీడియో కాల్‌ చేసి ప్రాధేయపడినా.. ఇంటికి రాని భర్త.. భార్య ఆత్మహత్య

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:04 PM

భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. సూరారం సీఐ వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం ఆర్‌జీకే కాలనీలో ఎస్‌కే ఫర్జానా(35) భర్త ఎస్‌కే ఖదీర్‌అలీ, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు.

Hyderabad: వీడియో కాల్‌ చేసి ప్రాధేయపడినా.. ఇంటికి రాని భర్త.. భార్య ఆత్మహత్య

గాజులరామారం(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. సూరారం సీఐ వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం ఆర్‌జీకే కాలనీలో ఎస్‌కే ఫర్జానా(35) భర్త ఎస్‌కే ఖదీర్‌అలీ, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. వీరికి 2011లో వివాహమైంది. ఖదీర్‌ అలీ మద్యానికి బానిసై భార్యను కొంతకాలంగా వేధిస్తున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. గురువారం ఉదయం కుమార్తె స్కూల్‌ ఫీజు విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఖదీర్‌అలీ బయటకు వెళ్లిపోయాడు. భార్య ఫర్జానా వీడియో కాల్‌ చేసి ఇంటికి రమ్మని ప్రాధేయపడినా అతడు వినలేదు. మా అమ్మకు సారి చెప్తేనే వస్తానన్నాడు. మనస్తాపం చెందిన ఫర్జానా ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి గతంలో దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Updated Date - Jan 12 , 2024 | 01:04 PM