Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Hyderabad: ఆత్మహత్యకు యత్నించాడు.. రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:04 PM

ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాసబ్‌ట్యాంక్‌(Masabtank)కు చెందిన రంజిత్‌ (27) ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో జీవితాన్ని చాలించాలనుకున్నాడు.

Hyderabad: ఆత్మహత్యకు యత్నించాడు.. రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు

హైదరాబాద్: ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాసబ్‌ట్యాంక్‌(Masabtank)కు చెందిన రంజిత్‌ (27) ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో జీవితాన్ని చాలించాలనుకున్నాడు. శనివారం సాయంత్రం 6.30 సమయంలో లక్డీకాపూల్‌ రైల్వేవంతెన కింద పట్టాలపై పడుకున్నాడు. సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి వెళ్తున్న ఓ రైలు లోకో పైలట్‌ దానిని గుర్తించి ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి అతడిని తప్పుకోవాలని గట్టిగా అరిచాడు. దీంతో రంజిత్‌ కాస్త పక్కకు తప్పుకున్నా అప్పటికే ఇంజన్‌ పైకి రావడంతో అతడి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. లోకో పైలట్‌ 108 వారికి సమాచారం అందించడంతో వారు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన 108 ఆంబులెన్స్‌ ఈఎంటి సునీల్‌ను, పైలట్‌ రమేష్ లను పోలీసులు అభినందించారు.

city3.jpg

Updated Date - Mar 03 , 2024 | 12:12 PM