Share News

Hyderabad: ప్రాణం తీసిన బైక్‌ స్టంట్‌.. విన్యాసాలు చేస్తూ లారీని ఢీకొట్టి రౌడీషీటర్‌ మృతి

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:53 AM

బైక్‌ స్టంట్లతో సోషల్‌ మీడియాలో ప్రాచుర్యం పొందిన ఓ రౌడీషీటర్‌ ద్విచక్రవాహనంపై విన్యాసాలు చేస్తూ లారీని ఢీకొట్టి మరణించాడు

Hyderabad: ప్రాణం తీసిన బైక్‌ స్టంట్‌.. విన్యాసాలు చేస్తూ లారీని ఢీకొట్టి రౌడీషీటర్‌ మృతి

చాదర్‌ఘాట్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బైక్‌ స్టంట్లతో సోషల్‌ మీడియాలో ప్రాచుర్యం పొందిన ఓ రౌడీషీటర్‌ ద్విచక్రవాహనంపై విన్యాసాలు చేస్తూ లారీని ఢీకొట్టి మరణించాడు. పాతబస్తీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఠాకూర్‌ శ్రీకాంత్‌ సింగ్‌(24) దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాచిగూడ నింబోలిఅడ్డకు చెందిన శ్రీకాంత్‌ సింగ్‌ పదో తరగతి వరకూ చదివాడు. ప్రస్తుతం టాటూ ఆర్టిస్ట్‌. ద్విచక్రవాహనం(స్కూటర్‌)పై రకరకాల విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటాడు. అయితే, శుక్రవారం రాత్రి ఎంజీబీఎస్‌ నుంచి చాదర్‌ఘాట్‌ మీదుగా కాచిగూడ వెళ్తూ స్కూటర్‌పై విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో ఓ లారీని ఢీకొట్టి దాని వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్‌సింగ్‌పై కాచిగూడ పీఎస్‌లో రౌడీషీట్‌, సుల్తాన్‌బజార్‌ పీఎ్‌సలో వివిధ సెక్షన్ల కింద పలు కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Jan 28 , 2024 | 06:34 PM