Share News

Hyderabad: పెళ్లి చేసుకుంటానని మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:23 AM

పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో జనవరి 27న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి ఆత్మహత్యకు అహ్మద్‌ అలీ కారణమని గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Hyderabad: పెళ్లి చేసుకుంటానని మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

- నిందితుడు అహ్మద్‌ అలీ అరెస్ట్‌

రాజేంద్రనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో జనవరి 27న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి ఆత్మహత్యకు అహ్మద్‌ అలీ కారణమని గుర్తించి అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతిఽథి భరద్వాజ్‌(34) భర్త మరణించడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ పుప్పాలగూడలో నివాసముంటోంది. ఉప్పర్‌పల్లి(Upparpally)కి చెందిన అహ్మద్‌ అలీ(32)తో కొంతకాలంగా సహజీవనం చేయడం వల్ల గర్భం దాల్చింది. ఫిబ్రవరి 12న పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతిఽథి భరద్వాజ్‌ పేరును అజియా ఫాతిమాగా మార్చి ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌ ఫార్చునా ఐదో అంతస్తులో ఉంచాడు. అంతకు ముందే అహ్మద్‌ అలీ 2023 డిసెంబర్‌లో మరో యువతిని పెళ్లి చేసుకుని అదే అపార్ట్‌మెంట్‌ ఏడో అంతస్తులో పెట్టాడు. ఈ విషయం తెలిసిన అతిథి భరద్వాజ్‌ మనస్తాపం చెంది గత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కారణమైన అహ్మద్‌ అలీని పోలీసులు గుర్తించి 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Feb 01 , 2024 | 11:23 AM