Delhi: నడిరోడ్డుపై దారుణం.. భార్య ఎదుటే భర్తను చితక్కొట్టిన దుండగులు.. కారణమేంటంటే..
ABN , Publish Date - Jan 30 , 2024 | 04:35 PM
ఢిల్లీలో పట్ట పగలే దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై పడేసి అతడిని కర్రలతో చితక్కొట్టారు. అతడి భార్య ఎంతగా వేడుకున్న వారు దాడి ఆపలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీలో (Delhi) పట్ట పగలే దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై పడేసి అతడిని కర్రలతో చితక్కొట్టారు. అతడి భార్య ఎంతగా వేడుకున్న వారు దాడి ఆపలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని నరేలాలో ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడిని డిశ్ఛార్జ్ చేశారు (Crime News).
ఓ ఆస్తి వివాదం విషయమై ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. కాగా, వైరల్ అయిన ఆ దాడి వీడియోపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) స్పందించారు. ఆ ఘటనలో బాధితుడు, దాడి చేసిన వారు పేరు మోసిన నేరస్థులని పోలీసులు తెలిపారు. ఇరు వర్గాల వారిపై చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, దాడి చేసి పరారీలోకి వెళ్లిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఢిల్లీలో ఇలాంటి దాడులు, గొడవలు ఇటీవలి కాలంలో తరచుగా జరుగుతున్నాయి.