Share News

Karnataka: కర్ణాటకలో దారుణం.. ముస్లిం యువతితో కలిసి ఉన్నందుకు యువకుడిపై దాడి

ABN , Publish Date - Jan 07 , 2024 | 07:35 PM

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముస్లిం యువతి పక్కన కూర్చున్న పాపానికి ఓ హిందూ యువకుడ్ని ఒక ఆకతాయిల బృందం చితకబాదింది. తనని విడిచిపెట్టమని వేడుకున్నా వినిపించుకోకుండా..

Karnataka: కర్ణాటకలో దారుణం.. ముస్లిం యువతితో కలిసి ఉన్నందుకు యువకుడిపై దాడి

Karnataka: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముస్లిం యువతి పక్కన కూర్చున్న పాపానికి ఓ హిందూ యువకుడ్ని ఒక ఆకతాయిల బృందం చితకబాదింది. తనని విడిచిపెట్టమని వేడుకున్నా వినిపించుకోకుండా.. పైపులు, రాడ్లతో అతడ్ని కొట్టారు. ఆ యువతిని కూడా వేధించారు. చివరికి వారి వద్ద నుంచి ఫోన్లు, కొంత నగదు తీసుకొని వాళ్లు విడిచిపెట్టారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మొత్తం 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ/ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ కింది కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


సచిన్ లమని (18), ముస్కాన్ పటేల్ (22) ఇద్దరూ కలిసి శనివారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యువ నిధి’ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లారు. అయితే.. భోజనం సమయం కావడంతో ఒక గంట తర్వాత రమ్మని వాళ్లు వచ్చారు. దీంతో.. సచిన్, ముస్కాన్ కలిసి బెళగావిలోని కిల్లా సరసు వద్దకు వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరు కూర్చొని మాట్లాడుతుండగా.. కొందరు దుండగులు వారి వద్దకు వచ్చారు. ఆ ఇద్దరిని నిందితులు ఆరా తీయగా.. తమ పేర్లు సచిన్, ముస్కాన్ అని చెప్పారు. పేర్లతో వాళ్లిద్దరు వేర్వేరు మతాలకు చెందిన వారని గ్రహించి.. ఆ ఇద్దరిపై దాడి చేశారు. వాళ్ల నుంచి తప్పించుకోవడం కోసం ముస్కాన్ ముస్లిం కాదని, తన అత్త కుమార్తె అని చెప్పినా.. ఆ నిందితులు పట్టించుకోకుండా విచక్షణారహితంగా సచిన్‌ని కొట్టారు.

ఆ నిందితులతో మరో 13 మంది కలిసి.. సచిన్, ముస్కాన్‌లను ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ సచిన్‌ని దుర్భాషలాడుతూ.. శనివారం సాయంత్రం వరకూ పైప్స్, రాడ్లతో తీవ్రంగా కొట్టారు. అంతేకాదు.. సచిన్ మెడకు ఉచ్చు బిగించి, అతడ్ని చంపేందుకు కూడా ప్రయత్నించారు. చివరికి వాళ్లిద్దరు కాళ్ల మీద పడి వేడుకోవడంతో, ఆ నిందితులు ఆ ఇద్దరిని విడిచిపెట్టి వెళ్లారు. వారి వద్ద నుంచి రెండు ఫోన్లు, రూ.7 వేలు తీసుకుని నిందితులు వెళ్లిపోయారు. ఎలాగోలా పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్న సచిన్, ముస్కాన్.. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుల్ని గుర్తించి.. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - Jan 07 , 2024 | 07:35 PM