Share News

Chennai: ఎక్స్‌ప్రెస్‌ రైలుపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్ల దాడి

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:14 AM

తిరువొత్తియూర్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్లతో దాడికి పాల్పడి పరారైన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆర్పీఎఫ్‌ పోలీసులు(RPF Police) గాలిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య కావేరి ఎక్స్‌ప్రెస్‏ను నడుపుతున్నారు.

Chennai: ఎక్స్‌ప్రెస్‌ రైలుపై  గుర్తుతెలియని వ్యక్తుల రాళ్ల దాడి

ప్యారీస్‌(చెన్నై): తిరువొత్తియూర్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్లతో దాడికి పాల్పడి పరారైన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆర్పీఎఫ్‌ పోలీసులు(RPF Police) గాలిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య కావేరి ఎక్స్‌ప్రెస్‏ను నడుపుతున్నారు. శుక్రవారం రాత్రి మైసూరు(Mysore) నుంచి బయల్దేరిన రైలు శని వారం తెల్లవారుజామున 2.15 గంటలకు తిరువొత్తియూర్‌ చేరుకున్న సమయంలో చీకట్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన రాళ్ల దాడిలో ఏడు బోగీలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై లోకో పైలెట్‌ అందజేసిన ఫిర్యాదుతో తిరువొత్తియూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 10:14 AM