Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Chennai: ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తా.. అంటూ బెదిరిస్తున్నాడు..

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:06 AM

ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తానని బెదిరించిన కేసులో ఓ ప్రేమికుడు సహా ఇద్దర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోయంబత్తూర్‌ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని పాఠశాలలో టెన్త్‌ చదువుతోంది.

Chennai: ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తా.. అంటూ బెదిరిస్తున్నాడు..

- పోక్సో చట్టం కింద ఇద్దరు యువకుల అరెస్ట్‌

చెన్నై: ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తానని బెదిరించిన కేసులో ఓ ప్రేమికుడు సహా ఇద్దర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోయంబత్తూర్‌ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని పాఠశాలలో టెన్త్‌ చదువుతోంది. ఈ బాలికకు కొద్ది నెలల క్రితం ఇన్‌స్టాగ్రాం ద్వారా అజారుద్దీన్‌ (19) పరిచయమ్యాడు. వీరివురు సెల్‌ఫోన్‌లో తరచూ మాట్లాడుకునే వారు. ఈ నేపథ్యంలో, ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని, సెల్‌ఫోన్‌ ద్వారా డబ్బులు పంపాలని అజారుద్దీన్‌ పలుమార్లు బెదిరిస్తుండడంతో, ఆ బాలిక అతనితో మాట్లాడడం తగ్గించింది. అయితే మళ్లీ ఫోన్‌ చేసిన అజారుద్దీన్‌... తాను ప్రేమిస్తున్నానని, ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తానని బాలికను బెదిరించినట్లు తెలిసింది. ఇందుకు అజారుద్దీన్‌ స్నేహితుడు ఆకాష్‌ (21) సహకరించాడు. ఈ నేపథ్యంలో, అజారుద్దీన్‌ వేధింపులు తట్టుకోలేని బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పొల్లాచ్చి వెస్ట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అజారుద్దీన్‌, ఆకా్‌షను అరెస్ట్‌ చేశారు.

Updated Date - Mar 03 , 2024 | 11:06 AM