Share News

Chennai: ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ వధువు మృతి!

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:40 AM

తన మనసుకు నచ్చిన యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక నవ వధువు, పెళ్లయిన 20 రోజులకే మృతి చెందింది.

Chennai: ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ వధువు మృతి!

చెన్నై: తన మనసుకు నచ్చిన యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక నవ వధువు, పెళ్లయిన 20 రోజులకే మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు... వినాయకపురం, వేల్‌మురుగన్‌ నగర్‌కు చెందిన ఇందుజా (27) ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఈమె గత ఐదేళ్లుగా పెరంబూరు ఎస్‌బీఐ కాలనీకి చెందిన హరిహరన్‌ (30)ను ప్రేమిస్తుంది. ఈ క్రమంలో వీరి వివారం గత నెల 21న జరిగింది. ఈ నేపథ్యంలో ఇందుజా శుక్రవారం అత్తగారి ఇంట్లో పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ వెంటనే ఆమెను భర్త స్థానిక కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి, ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. వివాహమైన 20 రోజుల్లోనే ఇందుజా చనిపోవడంతో ఆర్డీవో విచారణకు పోలీసులు సిఫార్సు చేశారు. అలాగే, మృతురాలి తల్లి ఆనంది తన కుమార్తె మృతిలో అనుమానం ఉందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఓట్టేరి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - Feb 11 , 2024 | 10:40 AM