Share News

Tax Saving: NPS ద్వారా ఈ పన్నులను ఈజీగా ఆదా చేసుకోవచ్చు

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:01 PM

NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. దీని ద్వారా వ్యక్తులు పన్నులను ఆదా చేయడంతోపాటు పదవీ విరమణ కోసం నిధులను నిర్మించుకోవడంలో సహాయపడుతుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tax Saving: NPS ద్వారా ఈ పన్నులను ఈజీగా ఆదా చేసుకోవచ్చు

NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) అనేది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. దీని ద్వారా వ్యక్తులు పన్నులను ఆదా చేయడంతోపాటు పదవీ విరమణ కోసం నిధులను నిర్మించుకోవడంలో సహాయపడుతుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఉద్యోగులు వారి పన్నులను ఆదా చేసుకునేందుకు అనేక రకాల మార్గాలను అన్వేషిస్తారు. అలాంటి వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 CCD (1) కింద 1.5 లక్షల రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు.


దీంతోపాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (1B) ద్వారా రూ.50,000 వరకు వ్యక్తిగతంగా తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు కార్పొరేట్ NPS మోడల్‌లోని సబ్‌స్క్రైబర్‌లు ప్రాథమిక జీతంలో 10% వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (2) కింద అదనపు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ప్రయోజనం రూ.7.5 లక్షలకు పరిమితం చేయబడుతుంది. అయితే ఈ పన్ను ప్రయోజనాలు పాత ఆదాయపు పన్ను విధానంలోని ప్రయోజనాలు పొందే వారికి మాత్రమే వర్తిస్థాయి. ఇక కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రయోజనాలు పొందే వారికి కార్పొరేట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ మోడల్ వర్తిస్తుంది.

మరోవైపు సబ్‌స్క్రైబర్‌లు ముందుగా వివరించిన విధంగా NPS కంట్రిబ్యూషన్‌లపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండో మినహాయింపు ఎలాంటి పన్నుయం లేకుండా రాబడిని ఆర్జించే విరాళాలకు వర్తిస్తుంది. ఈ క్రమంలో ఉపసంహరణ (60% వరకు) పన్ను మినహాయింపు ఉంటుంది. కార్పస్‌లో 40%తో యాన్యుటీ ఉత్పత్తిని కొనుగోలు చేయడం ద్వారా కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ క్రమంలో జాతీయ పెన్షన్ వ్యవస్థను అర్థం చేసుకుని ప్రత్యేక పన్ను ప్రయోజనాలను పొందాలని ఆర్థిక నిపుణలు సూచిస్తున్నారు. NPS అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ కోసం ఒక గొప్ప పథకంగా పరిగణించబడుతుంది. ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన అనేక పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

Updated Date - Jan 03 , 2024 | 01:01 PM