Share News

Stock Market: స్పల్ప నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:43 PM

అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యం కావొచ్చనే అంచనాలు వెలువడడంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

Stock Market: స్పల్ప నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు..!

అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యం కావొచ్చనే అంచనాలు వెలువడడంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ సూచీలు కూడా లాభాలను అందుకోలేకపోయాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయింది (Business News).

బుధవారం ఉదయం 73,903 పాయింట్ల వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 74,151 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరకు 27 పాయింట్ల నష్టంతో 73,876 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, లారస్ ల్యాబ్స్, మనప్పురం ఫైనాన్స్, నాల్కో లాభాలు అందుకున్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్, డీఎన్‌ఎఫ్, టొరెంట్ ఫార్మా, డిక్సన్ టెక్నాలజీస్ నష్టాల బాట పట్టాయి. నిఫ్టీ బ్యాంక్ 78 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 257 పాయింట్లు లాభపడ్డాయి.

ఇది కూడా చదవండి..

World Bank: 2024లో భారత్ వృద్ధి గురించి ప్రపంచ బ్యాంకు కీలక ప్రకటన

Updated Date - Apr 03 , 2024 | 04:43 PM