Share News

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 790 పాయింట్లు డౌన్!

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:01 PM

దేశీయ సూచీలు (Stock Market) ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ మళ్లీ 75 వేల లోపునే క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా ఆద్యంతం నష్టాల్లోనే కదలాడింది.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 790 పాయింట్లు డౌన్!
బీఎస్‌ఈ

దేశీయ సూచీలు (Stock Market) ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ మళ్లీ 75 వేల లోపునే క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా ఆద్యంతం నష్టాల్లోనే కదలాడి 234 పాయింట్ల దిగువన స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. (Business News).


శుక్రవారం ఉదయం 74, 889 వద్ద రోజును ప్రారంభిన సెన్సెక్స్ ఒక దశలో 74,189 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. చివరకు 793 పాయింట్ల నష్టంతో 74, 244 వద్ద రోజును ముగించింది. ఇక, గత బుధవారం జీవిత కాల గరిష్టానికి చేరుకున్న నిఫ్టీ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. 234 పాయింట్లు కోల్పోయింది. 22,519 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 422 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 312 పాయింట్లు నష్టపోయింది.


సెన్సెక్స్‌లో వేదాంత, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐఆర్‌సీటీసీ, సీజీ కన్జ్యూమర్ లాభాలను కళ్లజూశాయి. అలాగే పేజ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, లారస్ ల్యాబ్స్, మారుతీ సుజికీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే వారాంతం కావడంతో అమ్మకాలకు దిగారు.

ఇవి కూడా చదవండి..

Moodys: 2024లో భారత్ జీడీపీ భారీగా తగ్గించిన మూడీస్..ఎందుకిలా


Alert: జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు..వెంటనే దాఖలు చేయండి


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 04:01 PM