Share News

Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:56 PM

మంగళవారం స్వల్ప నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు బుధవారం రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 77 వేలను కూడా దాటేసి దూకుడు ప్రదర్శించింది. అయితే చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభ లాభాలను కోల్పోయింది.

Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!
Stock Market

మంగళవారం స్వల్ప నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు బుధవారం రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 77 వేలను కూడా దాటేసి దూకుడు ప్రదర్శించింది. అయితే చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభ లాభాలను సెన్సెక్స్ (Sensex) కోల్పోయింది. ఆర్థిక రంగ షేర్లు, బ్యాకింగ్ రంగం లాభాల బాటలో పయనించాయి. (Business News).


మంగళవారం ముగింపు (76,456)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 76,679 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 77,050 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. మరోసారి 77 వేల మైలు రాయిని దాటింది. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్టాల నుంచి దాదాపు 400 పాయింట్లు కోల్పోయింది. చివరకు 149 పాయింట్ల లాభంతో 76,606 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 23,322 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, కంటైనర్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, అంబుజా సిమెంట్స్ షేర్లు లాభపడ్డాయి. పిడిలైట్ ఇండస్ట్రీస్, మారికో, మెట్రోపోలిస్, యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 189 పాయింట్లు లాభపడింది. నిఫ్టి మిడ్ క్యాప్ ఇండెక్స్ 559 పాయింట్లు లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.54గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Stock Markets: 557 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపద..


Gold and Silver Rate: తగ్గిన గోల్డ్ ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన గోల్డ్, భారీగా తగ్గిన వెండి


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2024 | 03:56 PM