Share News

Stock Market: నష్టాలతోనే ఏడాదికి ముగింపు.. చివర్లో భారీగా కోలుకున్న సెన్సెక్స్..

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:54 PM

దేశీయ సూచీలు సంవత్సరంలో చివరి రోజున కూడా నష్టాలతోనే ముగిశాయి. నష్టాలతోనే ఈ ఏడాదికి గుడ్ బై చెప్పాయి. హెవీ వెయిట్ ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ నష్టాల్లోనే కదలాడింది. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాల్లో కదలాడడంతో నిఫ్టీ భారీ నష్టాల నుంచి కోలుకుంది.

Stock Market: నష్టాలతోనే ఏడాదికి ముగింపు.. చివర్లో భారీగా కోలుకున్న సెన్సెక్స్..
Stock Market

గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు సంవత్సరంలో చివరి రోజున కూడా నష్టాలతోనే ముగిశాయి. నష్టాలతోనే ఈ ఏడాదికి గుడ్ బై చెప్పాయి. హెవీ వెయిట్ ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ నష్టాల్లోనే కదలాడింది. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాల్లో కదలాడడంతో నిఫ్టీ భారీ నష్టాల నుంచి కోలుకుంది. ఇంట్రాడే కనిష్టం నుంచి సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత ఏకంగా 600 పాయింట్లు ఎగబాకింది. అయితే చివరకు నష్టాలతోనే రోజును ముగించింది. నిఫ్టీ మాత్రం స్వల్పంగా లాభపడింది. (Business News).


సోమవారం ముగింపు (78, 248)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 270 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో దాదాపు 680 పాయింట్లు కోల్పోయి 77, 560 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ కోలుకుంది. ఇంట్రాడే కనిష్టం నుంచి 600 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 109 పాయింట్ల నష్టంతో 78, 139 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలతో రోజును ప్రారంభించింది. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చింది. చివరకు 13 పాయింట్ల స్వల్ప లాభంతో 23, 658 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో హడ్కో, మహానగర్ గ్యాస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అరబిందో ఫార్మా షేర్లు లాభాలు అందుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎంఫసిస్, మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 36 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.61గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 31 , 2024 | 03:54 PM