Stock Market: రోజంతా ఒడిదుడుకులు.. చివరకు ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:03 PM
రోజంతా లాభనష్టాలతో దోబూచులాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా రోజును ముగించాయి. ఒక దశలో 80 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్ చివరకు మళ్లీ 80 వేలకు దిగువనే క్లోజ్ అయింది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్సియల్ సెక్టార్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

రోజంతా లాభనష్టాలతో దోబూచులాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా రోజును ముగించాయి. ఒక దశలో 80 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్ చివరకు మళ్లీ 80 వేలకు దిగువనే క్లోజ్ అయింది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్సియల్ సెక్టార్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వారాన్ని సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది. (Business News).
గత వారం ముగింపు (79, 996)తో పోల్చుకుంటే దాదాపు 80 పాయింట్ల నష్టంతో 79, 915 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొంది. సోమవారం సెన్సెక్స్ 79, 731- 80,067 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు 36 పాయింట్ల స్వల్ప నష్టంతో 79, 960 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. చివరకు 3.30 పాయింట్ల నష్టంతో 24,320 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ఆర్‌ఈసీ, మారికో, గోద్రేజ్ కన్స్యూమర్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పెర్సిస్టెంట్, దివీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 201 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 234 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.49గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Nina Kothari: ముఖేష్ అంబానీ సోదరి గురించి తెలుసా.. భర్తను కోల్పోయినా వందల కోట్ల కంపెనీకి..
ITR filing 2024: మీ ఆదాయపు పన్ను రీఫండ్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..