Share News

GDP: దూసుకుపోనున్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఏకంగా 8.4 శాతంగా జీడీపీ

ABN , Publish Date - Feb 29 , 2024 | 07:08 PM

దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోనుంది. జీడీపీ అంచనాలు గతేడాది ఇదే సమయంతో పోల్చితే రెండింతలు పెరగడం శుభ పరిణామమని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) ఏడాది ప్రాతిపదికన 8.4 శాతానికి చేరుకుందని గురువారం కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

GDP: దూసుకుపోనున్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఏకంగా 8.4 శాతంగా జీడీపీ

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోనుంది. జీడీపీ అంచనాలు గతేడాది ఇదే సమయంతో పోల్చితే రెండింతలు పెరగడం శుభ పరిణామమని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) ఏడాది ప్రాతిపదికన 8.4 శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి జీడీపీ వృద్ధి రేటు 4.3 శాతంగా ఉంది. 2022-23 మూడో త్రైమాసికంలో రూ.40.35 లక్షల కోట్లు రాబడి ఉండగా.. 2023-24 మధ్య కాలానికి జీడీపీ రూ.43.72 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం కంటే తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేయగా.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. నిర్మాణ రంగం (10.7 శాతం) రెండంకెల వృద్ధి రేటు, తయారీ రంగం (8.5 శాతం) మంచి వృద్ధి రేటు కనబరుస్తుందని ప్రభుత్వం చెప్పింది. ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు పెరగడమే జీడీపీ పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రభుత్వం వివరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 29 , 2024 | 07:13 PM