Share News

Yohan Poonawalla: క్వీన్ ఎలిజబెత్ 2 రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసిన భారతీయ వ్యాపారవేత్త.. ధర ఏంతంటే

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:47 AM

దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఒకరైన పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన యోహాన్ పూనావాలా(yohan poonawalla)కు లగ్జరీ కార్లంటే విపరీతమైన ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన ఓ అరుదైన కారు(car)ను కొనుగోలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Yohan Poonawalla: క్వీన్ ఎలిజబెత్ 2 రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసిన భారతీయ వ్యాపారవేత్త.. ధర ఏంతంటే

భారతదేశంలోని బిలియనీర్ల జాబితాలో ఉన్న పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన యోహాన్ పూనావాలా(Yohan Poonawalla)కు లగ్జరీ కార్లంటే విపరీతమైన ఇష్టం. అతని కార్ల సేకరణలో రోల్స్ రాయిస్, ఫెరారీతో సహా అనేకం ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వానికి చెందిన ప్రత్యేకమైన కారు అతని కలెక్షన్‌లో తాజాగా చేరింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

ఇటీవల యోహాన్ పూనావాలా బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2(queen elizabeth 2) లగ్జరీ రేంజ్ రోవర్‌(range rover) కారును కొనుగోలు చేశారు. ఈ కారును ఇటీవల వేలానికి ఉంచిన క్రమంలో తీసుకున్నారు. ఈ కారు ప్రత్యేక విషయం ఏమిటంటే రిజిస్ట్రేషన్ నంబర్ కూడా దివంగత రాణి ఉపయోగించినదే కావడం విశేషం. ఈ వాహనాన్ని కొనుగోలు చేయడంపై పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. వాహనం ఒరిజినల్ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడం బోనస్ లాంటిదని ఆయన అన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: BYD Seal: టెస్లాను టెన్షన్ పెడుతున్న BYD.. కళ్లు చెదిరే ఫీచర్స్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 570 కి.మీ రేంజ్..


సాధారణంగా ఒక కారు రాజ కుటుంబం నుంచి వచ్చేటప్పుడు దాని నంబర్ ప్లేట్ మారుతుంది. కానీ ఈ కారుకు దివంగత క్వీన్ ఉపయోగించిన నంబర్ అలాగే ఉంటుందని చెప్పారు. ఈ కారు 2016 నాటి రేంజ్ రోవర్(range rover). SDV8 ఆటోబయోగ్రఫీ LWB ఎడిషన్. ఈ కారు కొన్ని నెలల క్రితం 224,850 పౌండ్ల ధరతో అంటే రూ. 2.25 కోట్లకు పైగా వేలానికి జాబితా చేయబడింది. ఈ కారు ఇప్పటివరకు దాదాపు 18,000 మైళ్లు ప్రయాణించింది. పూనావాలా ఈ వేలంలో పాల్గొనలేదు. కానీ అతను వ్యక్తిగతంగా కారును కొనుగోలు చేశారు.

ఈ కారును రాజ కుటుంబం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. అందువల్ల ఈ కారు ఎడిషన్‌లోని ఇతర కార్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. రాజకుటుంబం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, కారులో పోలీసు ఎమర్జెన్సీ లైటింగ్, రహస్య లైటింగ్, ప్రత్యేక మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. క్వీన్‌ కారు(car) లోపలికి, బయటికి వెళ్లడాన్ని సులభతరం చేయడానికి, కారు వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. కారులో చేసిన మార్పులను అలాగే ఉంచుతామని పూనావాలా తీసుకున్న సందర్భంగా అన్నారు. ఇవి కాకుండా కారులో షూటింగ్ స్టార్ హెడ్‌లైనర్, హెడ్‌రెస్ట్‌పై RR మోనోగ్రామ్, మసాజ్ సీట్లు, ప్రైవసీ గ్లాస్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Updated Date - Feb 26 , 2024 | 11:47 AM