Share News

Bank Holidays: ఏప్రిల్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:09 PM

వచ్చే నెలలో అంటే ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు(Bank Holidays) రానున్నాయి. దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. అయితే ఏప్రిల్ 2024లో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి, ఎన్ని రోజులు పనిదినాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays: ఏప్రిల్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే

వచ్చే నెలలో అంటే ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు(Bank Holidays) రానున్నాయి. దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు(banks) పనిచేయనున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1తో ప్రారంభమవుతుంది. అయితే ఏప్రిల్ 2024లో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి, ఎన్ని రోజులు పనిదినాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జాబితా ప్రకారం ఏప్రిల్ 2024లో 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే ఈ సెలవుల్లో వారాంతాల్లో రెండవ, నాల్గవ శనివారం, ఆదివారం, పండుగల సెలవులు కూడా ఉన్నాయి. ఆ సెలవుల జాబితాను ఇప్పుడు చుద్దాం.


 • ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సరం చివర 31న బ్యాంకులు మూసివేయబడనందున ఏప్రిల్ 1న బ్యాంకుకు సెలవు ఉంటుంది

 • ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, జుమాత్ ఉల్ విదా కారణంగా శ్రీనగర్, జమ్మూ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 7: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 9: గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సరం కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 10: రంజాన్ ఈద్ కారణంగా కొచ్చి, కేరళలో బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 11: ఈద్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 13: రెండవ శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

 • ఏప్రిల్ 14: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 15: హిమాచల్ డే కారణంగా గౌహతి, సిమ్లా జోన్లలో బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 17: శ్రీరామ నవమి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాంచీ, సిమ్లా, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 20: గరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 21: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు

 • ఏప్రిల్ 27: నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు

 • ఏప్రిల్ 28: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Mumbai: ఆసియా కుబేరుల అడ్డా ముంబై

Updated Date - Mar 27 , 2024 | 12:12 PM