Share News

Gowtham Adani: క్వాల్‌కం సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:47 PM

బిలియనీర్ గౌతమ్ అదానీ(Gowtham Adani)తో క్వాల్‌కం లిమిటెడ్(Qualcomm Ltd) ప్రెసిడెంట్, సీఈవో క్రిస్టియానో ఆర్ అమోన్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

Gowtham Adani: క్వాల్‌కం సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ

ఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ(Gowtham Adani)తో క్వాల్‌కం లిమిటెడ్(Qualcomm Ltd) ప్రెసిడెంట్, సీఈవో క్రిస్టియానో ఆర్ అమోన్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి భేటీకి సంబంధించి అదానీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీపై భారత్‌కి ఉన్న అవకాశాలపై చర్చించడానికి గౌతమ్ అదానీ, క్రిస్టియానో ఆర్ అమోన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

"సెమీకండక్టర్స్, AI, మొబిలిటీ, ఎడ్జ్ అప్లయెన్సెస్, వివిధ మార్కెట్‌లలో క్రిస్టియానో దూర దృష్టి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన ప్రణాళికలు, భారత్ సామర్థ్యానికి సంబంధించిన నిబద్ధత గురించి వినడం చాలా ఉత్సాహంగా ఉంది!" అని అదానీ Xలో పేర్కొన్నారు. క్రిస్టియానో ​​అమోన్ మార్చి 14న చెన్నైలోని రామానుజన్ ఐటీ సిటీలో కొత్త డిజైన్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.


ఈ కేంద్రంతో చెన్నైలో 1,600 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. Wi-Fi టెక్నాలజీలో మెరుగైన ఆవిష్కరణలపై దృష్టి సారించి, వైర్‌లెస్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన కొత్త కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి రూ.177.3 కోట్ల పెట్టుబడి పెట్టాలని క్వాల్‌కం ప్రతిపాదించింది. చిప్‌ల తయారీలో అంతర్జాతీయ పవర్‌హౌస్‌గా నిలిచేందుకు మూడు సెమీకండక్టర్ ప్లాంట్‌లను నెలకొల్పే ప్రతిపాదనలకు గత వారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆమోదించిన ఈ ప్లాంట్‌లలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి టాటా గ్రూప్ మెగా ఫ్యాబ్ ముందుకొచ్చింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 01:47 PM