Share News

IPO Watch: వచ్చే వారంలో ఐపీఓల జాతర.. నాలుగు కంపెనీలు లిస్టింగ్!

ABN , Publish Date - Jan 14 , 2024 | 09:46 PM

వచ్చే వారం ఐపీఓల జాతర జరగనుంది. సోమవారం నుంచి ఏకంగా ఐదు ఐపీఓలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం రూ.1680 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఈ ఐపీఓలు రాబోతున్నాయి. ఈ ఐదింట్లో మూడు ఎస్‌ఎంఈ సిగ్మెంట్లోనూ, మరో రెండు మెయిన్ బోర్డ్‌లో సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నాయి.

IPO Watch: వచ్చే వారంలో ఐపీఓల జాతర.. నాలుగు కంపెనీలు లిస్టింగ్!

వచ్చే వారం ఐపీఓల (IPOs) జాతర జరగనుంది. సోమవారం నుంచి ఏకంగా ఐదు ఐపీఓలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం రూ.1680 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఈ ఐపీఓలు రాబోతున్నాయి. ఈ ఐదింట్లో మూడు ఎస్‌ఎంఈ సిగ్మెంట్లోనూ, మరో రెండు మెయిన్ బోర్డ్‌లో సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నాయి. మెడి అసిస్ట్, ఎపాక్ డ్యూరబుల్ మెయిన్ బోర్డ్‌లో సబ్‌స్క్రిప్షన్‌కు రాబోతున్నాయి. గత వారం ఐపీఓకు వచ్చిన జ్యోతి సీఎన్‌సీ, ఐబీఎల్ ఫైనాన్స్, న్యూ స్వాన్ మల్టీటెక్, ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సోలార్ ఈ వారంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి.

మెడి అసిస్ట్: ( Medi Assist Healthcare IPO)

ఐపీఓ: ఈ నెల 15న ప్రారంభమై 17న ముగుస్తుంది.

ధరల శ్రేణి: రూ.319-418

షేర్లు : కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి

సమీకరణ లక్ష్యం: రూ.1172 కోట్లు

ఎపాక్ డ్యూరబుల్: (Epack Durable IPO)

ఐపీఓ: ఈ నెల 19న ప్రారంభమై 23న ముగుస్తుంది.

ధరల శ్రేణి: వెల్లడి కాలేదు.

సమీకరణ లక్ష్యం: రూ.400 కోట్లు

మ్యాక్స్ పోజర్: (ఎస్‌ఎంఈ సిగ్మెంట్)

ఐపీఓ: ఈ నెల 15న ప్రారంభమై 17న ముగుస్తుంది.

ధరల శ్రేణి: రూ.31-33

సమీకరణ లక్ష్యం: రూ.20.26 కోట్లు

కాన్‌సెలెక్ట్ ఇంజినీర్స్: (ఎస్‌ఎంఈ సిగ్మెంట్)

ఐపీఓ: ఈ నెల 19న ప్రారంభమై 23న ముగుస్తుంది.

ధరల శ్రేణి: రూ.66-70

సమీకరణ లక్ష్యం: రూ.28.70 కోట్లు

అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ: (ఎస్‌ఎంఈ సిగ్మెంట్)

ఐపీఓ: ఈ నెల 19న ప్రారంభమై 23న ముగుస్తుంది.

ధరల శ్రేణి: రూ.130-140

Updated Date - Jan 14 , 2024 | 09:46 PM