Share News

Adani Group: అదానీ గ్రూపులో కొత్త పరిణామం..గౌతమ్ అదానీ వారసుడు కరణ్‌కు కీలక బాధ్యతలు

ABN , Publish Date - Jan 04 , 2024 | 12:10 PM

అదానీ గ్రూప్(Adani Group) కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) నిర్వహణలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. అదానీ పోర్ట్‌లో గౌతమ్ అదానీ వారసుడు కరణ్ అదానీకి కీలక బాధ్యతలు అప్పగించారు.

Adani Group: అదానీ గ్రూపులో కొత్త పరిణామం..గౌతమ్ అదానీ వారసుడు కరణ్‌కు కీలక బాధ్యతలు

అదానీ గ్రూప్(Adani Group) కంపెనీ అయిన అదానీ పోర్ట్స్(adani ports) అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) నిర్వహణలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. అదానీ పోర్ట్‌లో గౌతమ్ అదానీ వారసుడు కరణ్ అదానీ(karan adani)కి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కరణ్ అదానీని కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఎంపికచేశారు. గతంలో కరణ్ అదానీ పోర్ట్‌లో సీఈవోగా పనిచేశారు. అప్పుడు గౌతమ్ అదానీ కంపెనీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు గౌతమ్ అదానీ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. కాగా కరణ్ అతని స్థానంలో చేరారు. మరోవైపు కరణ్ సీఈఓ పదవిలో నిస్సాన్ మోటార్స్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విని గుప్తాను నియమించారు.


ఇక కరణ్ అదానీ అమెరికా(USA)లోని పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీని పొందారు. 2009లో ముంద్రా పోర్ట్‌లో అదానీ గ్రూప్‌తో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత 2016లో CEOగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జనవరి 3 నాటికి రూ.2,36,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఉన్న APSEZకి కరణ్ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు అదానీ గ్రూప్ వ్యూహాత్మక అభివృద్ధి, రోజువారీ కార్యకలాపాలలో కూడా కరణ్ గతంలో కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలో గౌతమ్ అదానీ(gautam adani) జనవరి 4 నుంచి కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు. అతను జూన్ 30, 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కరణ్ పదవీకాలం జనవరి 4 నుంచి అమలులోకి వస్తుంది. అతను మే 23, 2027 వరకు ఈ పదవిలో ఉంటాడు. అశ్వనీ గుప్తా సీఈవోగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లపాటు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Jan 04 , 2024 | 12:10 PM