మూడోరోజు విద్యుత్ ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Feb 28 , 2024 | 11:08 PM
విద్యుత్ శాఖలో ఈఈ పనితీరుపై వైసీపీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపా రు.
మార్కాపురం వన్‌టౌన్, ఫిబ్రవరి 28: విద్యుత్ శాఖలో ఈఈ పనితీరుపై వైసీపీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపా రు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 3రోజులుగా ఉద్యోగులు నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పద్ధతి మార్చుకోకుండా ఈఈ వ్యవహరి స్తే సామూహిక సెలవులు పెడతామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉ ద్యోగులు పాల్గొన్నారు.