భక్తి శ్రద్ధలతో పోలాల అమావాస్య
ABN , Publish Date - Oct 03 , 2024 | 12:42 AM
గరుగుబిల్లి, రావుపల్లి, కొంకడివరం, తదితర గ్రామాలతోపాటు పార్వతీపురం పట్టణంలో బుధవారం పోలాల అమావాస్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
గరుగుబిల్లి / పార్వతీపురం టౌన్ : గరుగుబిల్లి, రావుపల్లి, కొంకడివరం, తదితర గ్రామాలతోపాటు పార్వతీపురం పట్టణంలో బుధవారం పోలాల అమావాస్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వరి దుబ్బును పూజా మందిరంలో పెట్టి, పిండి వంటలతో పాటు పలు రకాల కాయగూరలు, ఆకుకూలతో వండిన కలగాయ కూరను నైవేద్యంగా సమర్పించారు.