Share News

YCP List: వైసీపీ మూడో జాబితాకు ముహూర్తం రెడీనా?.. ఖరారైన ఎంపీ, ఎమ్మెల్యేలు వీరేనా?

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:27 AM

Andhrapradesh: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ మూడవ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. సీట్లు రాని వారి తిరుగుబాటు నేపథ్యంలో మూడవ జాబితాపై అధిష్టానం ముహూర్తాలు చూసే పనిలో పడింది. ఎక్కడా ఇబ్బందికర వాతావరణం లేకుండా అంతా సెట్ అయ్యాకే పేర్లు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

YCP List: వైసీపీ మూడో జాబితాకు ముహూర్తం రెడీనా?.. ఖరారైన ఎంపీ, ఎమ్మెల్యేలు వీరేనా?

అమరావతి, జనవరి 11: తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ మూడవ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. సీట్లు రాని వారి తిరుగుబాటు నేపథ్యంలో మూడవ జాబితాపై అధిష్టానం ముహూర్తాలు చూసే పనిలో పడింది. ఎక్కడా ఇబ్బందికర వాతావరణం లేకుండా అంతా సెట్ అయ్యాకే పేర్లు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ ఇష్యూల తరువాత అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు (గురువారం) సాయంత్రం 7 గంటల వరకూ అమావస్య ఉండడంతో 7 తరువాత లేదా రేపు (శుక్రవారం) జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఎంపీ స్ధానాలకు.....

  • విజయనగరం ఎంపీగా బొత్సా సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు

  • వైజాగ్ ఎంపీగా బొత్స సతీమణి బొత్సా జాన్సీ

  • కర్నూలు ఎంపీగా మంత్రి జయారాం

ఎమ్మెల్యే స్ధానాలకు ...

  • పెందుర్తి నుంచి అదీప్ రాజ్/మంత్రి గుడివాడ అమర్నాథ్

  • చింతలపూడి నుంచి విజయరాజ్

  • రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి

  • మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డి

  • నందికొట్కూరు నుంచి లబ్బివెంకటస్వామి/ డాక్టర్ సుధీర్

  • గూడురు నుంచి మేరుగ మురళి/ ఆర్డీవో కిరణ్‌ కుమార్

  • చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి ఆర్టీసీ వైస్ ఛైర్మన్

  • పూతలపట్టుకు మాజీ ఎమ్మెల్యే సునీల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 11 , 2024 | 11:27 AM