CBN Delhi Tour: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై విషం కక్కుతున్న పేటీఎం బ్యాచ్
ABN , First Publish Date - 2024-02-07T22:13:53+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై కూలీ, నీలి మీడియా విషయం కక్కుతోంది. పేటీఎం బ్యాచ్ మొత్తం తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తోంది. అమిత్ షా కాళ్లను చంద్రబాబు మొక్కారని ఒక మార్ఫింగ్ ఫోటోను.. ఇదే సమయంలో ప్రధాని మోడీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకొని నిలబడినట్టు మరో మార్ఫింగ్ ఫోటోని ఆ పేటీఎం బ్యాచ్ వైరల్ చేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై కూలీ, నీలి మీడియా విషయం కక్కుతోంది. పేటీఎం బ్యాచ్ మొత్తం తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తోంది. అమిత్ షా కాళ్లను చంద్రబాబు మొక్కారని ఒక మార్ఫింగ్ ఫోటోను.. ఇదే సమయంలో ప్రధాని మోడీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకొని నిలబడినట్టు మరో మార్ఫింగ్ ఫోటోని ఆ పేటీఎం బ్యాచ్ వైరల్ చేస్తోంది. ఈ ఫోటోలను ‘వే టు న్యూస్’ పేరిట షేర్ చేసింది. దీంతో.. వే టు న్యూస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది.
కాగా.. యోగ డే రోజున చంద్రబాబు యోగ చేస్తున్న ఫోటోని తీసుకొచ్చి.. అమిత్ షా కాళ్లు మొక్కుతున్నట్టు మార్ఫింగ్ చేశారు. ఈ ఫోటోపై టీడీపీ శ్రేణులు సీరియస్ అయ్యారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం వరకు ఓకే గానీ.. మరీ ఇంతలా దిగజారడం పద్ధతి కాదని కౌంటర్లు ఇస్తున్నారు. మరీ ఇంత ద్వేషరాగాలు ఉండకూడదని సూచిస్తూ.. ఈ మార్ఫింగ్ ఫోటో వ్యవహారంపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు. కోర్టులో పిటిషన్ వేయాలని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. అనంతరం 7:30 గంటలకు అమిత్ షా నివాసంలో ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చ జరిపినట్లు సమాచారం. అలాగే.. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చలు సాగాయని తెలుస్తోంది. ఇదిలావుండగా.. 2018లో ఎన్డీయే నుంచి బయటకొచ్చాక గతేడాది జులైలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇప్పుడు ఇంతకాలం తర్వాత అది కూడా సార్వత్రిక ఎన్నికల ముందు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.