Share News

Parthasarathi: మరోసారి పార్థసారథికి బుజ్జగింపులు.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇది..

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:18 PM

Andhrapradeshh: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పెనమలూరు ఎమ్మెల్యే సీటు కాదని పార్థసారథికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పడంతో రచ్చరచ్చగా మారింది. ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఎమ్మెల్యేగా అది కూడా పెనమలూరు నుంచే పోటీ చేస్తానని పార్థసారథి తేల్చిచెప్పేశారు. దీంతో రెండు రోజులుగా పార్థసారథిని బుజ్జగించే పనిలో వైసీపీ అధిష్టానం పడింది.

Parthasarathi: మరోసారి పార్థసారథికి బుజ్జగింపులు.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇది..

అమరావతి: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పెనమలూరు ఎమ్మెల్యే సీటు కాదని పార్థసారథికి (Penamaluru MLA Parthasarathy) మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పడంతో రచ్చరచ్చగా మారింది. ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఎమ్మెల్యేగా అది కూడా పెనమలూరు నుంచే పోటీ చేస్తానని పార్థసారథి తేల్చిచెప్పేశారు. దీంతో రెండు రోజులుగా పార్థసారథిని బుజ్జగించే పనిలో వైసీపీ అధిష్టానం పడింది. మంగళవారం నాడు ఎంపీ సీటుకు సంబంధించి పార్థసారథితో ప్రాంతీయ సమన్వయ కర్త అయోధ్యరామిరెడ్డి భేటీ అయ్యారు. మచిలీపట్నం ఎంపీగానే పోటీ చేయాలంటూ పార్థసారథికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు అంగీకరించేందుకు ఎమ్మెల్యే ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే పార్థసారథి కార్యాలయానికి అయోధ్యరామిరెడ్డి రాగా.. దాదాపు అరగంట పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. అయినప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి. దీంతో సారథి కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితమే అయోధ్యరామిరెడ్డి వెళ్లిపోయారు. సోమవారం జరిగిన చర్చల పట్ల పార్థసారథి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినప్పటికీ ఎమ్మెల్యే మెత్తబడని పరిస్థితి. సీనియర్ ఎమ్మెల్యే అయిన తన పట్ల వైసీపీ హైకమాండ్ వ్యవహరించిన తీరుపై సారథి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో సారథి టీడీపీలో చేరతారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 09 , 2024 | 03:35 PM