Share News

ఉప్పుటేరులో దూకి యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:51 AM

యువకుడు ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కైకలూరు రూర ల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉప్పుటేరులో దూకి యువకుడి ఆత్మహత్య
సోమశేఖర్‌ (ఫైల్‌)

కైకలూరు, ఫిబ్రవరి 5: యువకుడు ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కైకలూరు రూర ల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన మడిచర్ల సోమశేఖర్‌ (23) ఆదివారం రాత్రి కైకలూరు మండలం ఆలపాడు శివారులో ఉన్న ఉప్పుటేరు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని స్నేహితులతో కలసి ఆ ప్రాంతానికి వచ్చాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుం టానని పరిగెత్తుకుంటూ వెళ్లి ఉప్పుటేరులో దూకేశాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై టి.రామకృష్ణ గజ ఈతగాళ్ళతో ఉప్పుటేరులో గాలించి సోమవారం ఉదయానికి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Updated Date - Feb 06 , 2024 | 12:51 AM