Share News

అంతా మా ఇష్టం

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:34 AM

ఎన్నికల వేళ సమస్యలు మరుగున పడుతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నాయి.

అంతా మా ఇష్టం
వీరిశెట్టిగూడెంలో గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న ఇన్‌చార్జ్‌ విజయరాజు, కారుమూరి సునీల్‌, ఎంపీ కోటగిరి శ్రీధర్‌

శంకుస్థాపనలూ వారి చేతుల మీదే

చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను పక్కనబెట్టి మరీ సిత్రాలు

స్థానిక సంస్థల్లోనూ ఇష్టారాజ్యం.. కళ్లు మూసుకున్న యంత్రాంగం

అసలు సమస్యలన్నీ తెరమరుగే .. ఎన్నికల వేళ బదిలీలతో ఇంకో సమస్య

(ఏలూరు – ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఎన్నికల వేళ సమస్యలు మరుగున పడుతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాబోయే వైసీపీ అభ్య ర్థులు అప్పుడే ఎమ్మెల్యేలైనట్టు, ఎంపీ పీఠ మెక్కేసినట్టు అధికారికంగా శంకుస్థాప నలు, ప్రారం భోత్సవాలు చేసేస్తున్నారు. చింతలపూడి నియోజక వర్గంలో ప్రత్యేకించి ఈ తమాషా జరుగుతోంది. అక్కడ అధికార సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలీజాకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదని తేల్చారు. ఆయన స్థానంలో పోటీ చేయ బోయే అభ్యర్థిని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవీ కాలం మరో రెండు నెలలు మిగిలి ఉండగానే ఏలూరు లోక్‌సభ వైసీపీ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్‌, చింతలపూడి సమన్వయకర్త కె.విజయ రాజు రంగంలోకి దిగారు. అధికారులు దగ్గరుండి మరీ వీరిద్దరితో పునాదిరాళ్లు వేయిస్తూ ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. ప్రభుత్వ నియమావళికి విరుద్ధంగా వీరిద్దరూ ఏకపక్షంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే జిల్లా యంత్రాంగం చూసీ చూడనట్టు వదిలేసింది. ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా జిల్లా, మండలస్థాయి అధికారులు చేయాల్సిన శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలను ఒక పార్టీ రంగేసుకున్న వ్యక్తులు ఎలా చేస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. వరుసగా రెండు మూడుసార్లు ఈ తరహా ఘటనలు పునరావృతమైనా అధికారులకు కనబడదు, వినబడదు. ఎందుకంటే అధికారపక్షం కాబట్టే.

అన్నింటినీ పక్కనబెట్టి..

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ ప్రభుత్వం అన్నిటిపైనా స్పందిస్తోందని ఆ పార్టీ నేతలు కలరింగ్‌ ఇస్తున్నారు. అక్కడక్కడా పునాదిరాళ్లు, మందీ మార్బలం వెంటరాగా, ప్రభుత్వ కార్యక్రమాలపై ఊదర కొడుతు న్నారు. ఎప్పుడో గోతులూ గుంతలు పడిన రోడ్లకు కొన్ని చోట్ల మరమ్మతుల పేరిట హంగామా చేస్తున్నారు. అస లు సమస్యలను పక్కనబెట్టేశారు. రబీలో లక్షలాది ఎకరాలకు నీరందించాల్సిన పరిస్థితులపై సమీక్ష ఊసే లేదు. రబీ ఆలస్యంగా ఆరంభం కావడం, ఫిబ్రవరి రెండో వారం నాటికి గానీ నాట్లు పూర్తి కాకపోవడంతో నడి వేసవి నాటికి కోతకు వచ్చే అవకాశాలున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలుండగా, దీనికి అను గుణం గా గోదావరిలో నీటి లభ్యత, సరఫరా ఆసాంతం కొన సాగుతాయా లేదా అనే సందేహాలకు తావిచ్చింది. గతే డాదే నీటి సరఫరాలో అనేకచోట్ల ఆటంకాలు తొంగి చూశాయి. ముందుచూపుతో రైతులను రబీ వైపు కది లించాల్సి ఉండగా, ఎన్నికల ఏర్పాట్ల పేరిట అధికార యంత్రాంగం క్షణం తీరికలేకుండా గడుపుతోంది. ధాన్యం సేకరణ, రైతులకు నగదు చెల్లింపులు తదితర ఫిర్యాదులు ఇప్పటికే వచ్చి పడుతున్నాయి. వీటిపైన దృష్టే లేదు. టిడ్కో ఇళ్లు పేదలకు అందిస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. జగనన్న లేఅవుట్లు, హౌసింగ్‌ కాలనీల్లో ఎడాపెడా సమస్యలు. ఊరూరా సచివాల యాలు, రైతు భరోసా కేంద్రాలు, పాల కేంద్రాలు వీట న్నిటికీ సొంత భవనాలని ప్రకటించినా అనేకచోట్ల వాటి అడ్రసే లేదు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇదే తీరు. ఎన్నికల వేళ సమస్య ఎంత తీవ్రమైనా పట్టించుకునే తీరిక అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకపోయింది.

అంతా.. మారారు

దీర్ఘకాలంపాటు ఒకే జిల్లాలో పనిచేస్తున్న, ఎన్నికల విధులతో సంబంధం వున్న అధికారులందరికీ స్థానచల నం చేశారు. పొరుగు జిల్లా నుంచి రప్పించి వారికి పోస్టింగులు ఇచ్చారు. స్థానిక పరిస్థితులు తెలుసుకోవడానికి, అవగాహన రావడానికి సమయం పట్టనుంది. ఎన్నికలు జరిగేందుకు మరో 54 రోజులు గడువుండగా

ఇప్పటికే పోలీస్‌, రెవెన్యూ సహా కీలక విభాగాల్లో అధికారులంతా అటూ ఇటూ బదిలీ అయ్యారు. వీరిలో అత్యధికులకు ఎన్నికల శిక్షణ ఆరంభమైంది. తహసీల్దార్లు, ఆర్డీవోలంతా విజయవాడ, విశాఖ శిక్షణా కేంద్రా ల్లో ఉన్నారు. రేపోమాపో గానీ వీరు స్వస్థలాలకు చేరుకోలేరు. ఆ తదుపరి జిల్లాస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లకే వీరి సమ యం సరిపోతుంది. ఈలోపు ఎక్కడి సమస్యలు అక్కడే. ప్రత్యేకించి నోటిఫికేషన్‌ వెలువడడానికి ఇంకా కొద్దిరోజులే గడువు మిగిలింది. ఆ తర్వాత వ్యవహారమంతా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంతకంటే ముందుగానే ప్రభుత్వ కార్యాలయాల్లో తమ సొంత పనులు చక్కబెట్టుకోవడానికి అధికార వైసీపీ నేతల హడావుడి చేస్తున్నారు. నయానో భయానో పని పూర్తి కావాల్సిందేనంటూ కొన్ని శాఖాధిపతులపై తీవ్ర ఒత్తిడులు తెస్తున్నారు.

ఆందోళనలు.. ఆగ్రహావేశాలు

గడచిన రెండు మాసాలుగా ప్రభుత్వంపై వివిధ వర్గాల తిరుగుబాటు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ వీధులకెక్కి సర్కారుతో కయ్యానికి సిద్ధపడుతున్నారు. తొలుత అంగన్‌ వాడీలు ఆ తర్వాత ఆశాలు ఇప్పుడేమో ప్రభుత్వోద్యోగులు ఏకబిగిన జగన్‌ సర్కార్‌పై ఆగ్రహావేశాలు వ్యక్యం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలనినంటిలోనూ ఇప్పటికే నైరాశ్యం నెలకొంది. జగనన్నకు చెబుదాం .. పేరిట దరఖాస్తులైతే నమోద వుతున్నాయిగానీ, పరిష్కారం సున్నా. స్థానికంగా వైసీపీ అనుకూలురు సాధారణ జనంపై విరుచుకుపడుతుంటే న్యాయం చేయమంటూ ప్రాధేయపడుతున్నా ఫలితం ఉండడం లేదు. ఇంకోవైపు రైతుసంఘం బంద్‌కు పిలుపునిచ్చింది. గిరిజన వర్గాలైతే పోలవరం కేంద్రంగా జిల్లా కేటాయించాలని ఆందోళన బాట పట్టింది. డీఎస్సీ పోస్టులపై నిరుద్యోగులు రగిలిపో తున్నారు. ఓటర్ల జాబితాలు అనేక తికమకలూ తొంగి చూస్తూనే వున్నాయి.

Updated Date - Feb 17 , 2024 | 12:35 AM