సచివాలయమా..పార్టీ కార్యాలయమా..!
ABN , Publish Date - Feb 19 , 2024 | 12:08 AM
సాధా రణంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలపై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతుంది. కానీ పెదవేగి మండలం లక్ష్మీపురంలోని గ్రామ సచివాలయ భవనంపై వైసీపీ పతాకం ఎగురుతోంది.
లక్ష్మీపురం సచివాలయంపై వైసీపీ జెండా
పెదవేగి, ఫిబ్రవరి 18 : సాధా రణంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలపై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతుంది. కానీ పెదవేగి మండలం లక్ష్మీపురంలోని గ్రామ సచివాలయ భవనంపై వైసీపీ పతాకం ఎగురుతోంది. నెలరోజుల కిందట గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ప్రారంభించారు. ఈ భవనంపై ఇటీవల జాతీయ జండాకు బదులుగా వైసీపీ జండాను ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా భవనంపై పార్టీ జెండా ఎగురుతున్నా పట్టించుకునేవారే లేరు. ప్రభుత్వ భవనంపై వైసీపీ జెండాను ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.